Pawar politics: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్‌కు శరద్ పవార్ విందు ఆహ్వానం
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అస్సలు ఊహించలేం. ఇప్పుడు.. మహారాష్ట్రలో అలాంటి పరిస్థితులే హాట్‌టాపిక్‌గా మారాయి. సీనియర్ రాజకీయ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్.. ప్రత్యర్థులైన ముగ్గురు కీలక నేతలను విందుకు ఆహ్వానించడం కొత్త చర్చకు తెరలేపింది.

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అస్సలు ఊహించలేం. ఇప్పుడు.. మహారాష్ట్రలో అలాంటి పరిస్థితులే హాట్‌టాపిక్‌గా మారాయి. సీనియర్ రాజకీయ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్.. ప్రత్యర్థులైన ముగ్గురు కీలక నేతలను విందుకు ఆహ్వానించడం కొత్త చర్చకు తెరలేపింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ వ్యవస్థాపకులు, సీనియర్ నేత శరద్ పవార్.. తన ప్రత్యర్థులైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మరియు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌లను మార్చి 2న తన బారామతి నివాసంలో భోజనానికి ఆహ్వానించారు. ఈ విందు అహ్వానం మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఎన్సీపీని చీల్చి, బీజేపీ-శిండే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరిన కుమారుడు అజిత్‌తో విభేదాలు కొనసాగుతోన్న వేళ ఈ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది.
మార్చి 2న పుణె జిల్లాలోని బారామతిలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళా ప్రారంభోత్సవానికి శిండే, ఫడణవీస్, అజిత్ హాజరుకానున్నారు. శరద్ పవార్ రాజ్యసభ ఎంపీ కాగా, బారామతి పార్లమెంటు స్థానం నుంచి ఆయన కుమార్తె సుప్రియ సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపీ హోదాలో తామిద్దరం ఈ అధికారిక కార్యక్రమంలో భాగమవుతామని శరద్ పవార్ ఓ లేఖలో తెలిపారు. కార్యక్రమం అనంతరం తన నివాసమైన ‘గోవింద్‌బాగ్’లో భోజనానికి రావాల్సిందిగా ముగ్గురు నేతలకు ఆహ్వానం పంపారు.
వాస్తవానికి.. అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గాన్నే అసలైన ‘ఎన్సీపీ’గా గుర్తించిన ఎన్నికల సంఘం.. ఆ పార్టీ జెండా, ఎన్నికల గుర్తును కూడా వారికే కేటాయించింది. దీన్ని శరద్ పవార్ తీవ్రంగా తప్పుపట్టారు. మరోవైపు.. శరద్ పవార్ కుటుంబానికి పట్టున్న స్థానం బారామతి.. 2009 నుంచి సుప్రియ ఎంపీగా ఉన్నారు. అయితే, బారామతి నుంచి అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ కూడా పోటీ చేసే అవకాశాలున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బారామతిలో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల వేళ.. శరద్ పవార్ వేసిన విందు పాచిక దేనికి సంకేతం అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో అంతుచిక్కనివిగా మారాయి. ఏదేమైనా కీలక పరిణామాల మధ్య శరద్ పవార్ ‘విందు’ ఆహ్వానం రాజకీయ వర్గాల్లో చర్చలకు దారి తీస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




