Sea Turtles: పూడిమడక తీరంలో కలకలం.. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సముద్రపు తాబేళ్ల కళేబరాలు
అవును సముద్రపు తాబేళ్ల మనుగడ రోజురోజుకీ ప్రశ్నార్థకంగా మారుతోంది. సముద్ర జలాలను శుద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడుతున్న సముద్రపు తాబేళ్లు.. కడలి కలుషితం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా.. అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో సముద్రపు తాబేళ్ల కళేబరాలు కలకలం రేపాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సముద్రపు తాబేళ్ల కళేబరాలను చూసి స్థానికులు షాక్ అయ్యారు.
సముద్ర పర్యావరణ నేస్తంగా పిలుచుకునే సముద్ర తాబేళ్లు మానవ తప్పిడంతో అకాల మృత్యువాత పడుతున్నాయి. పెరుగుతున్న జల కాలుష్యంతో సముద్ర జలాలు కూడా కాలుష్యకోరాల్లో చిక్కుకున్నాయి. అయితే వస్తావంగా సముద్ర జలంలోని కాలుష్యాని తగ్గించే జీవులు ఈ సముద్ర తాబేళ్లు. ఎందుకంటే సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ సముద్రం నీరు కాలుష్యం కోరల నుంచి కాపాడుతాయి. అయితే ప్రస్తుతం ఈ తాబేళ్లు జాతి మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారిందమని ప్రకృతి ప్రేమికులు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవును సముద్రపు తాబేళ్ల మనుగడ రోజురోజుకీ ప్రశ్నార్థకంగా మారుతోంది. సముద్ర జలాలను శుద్ధి చేసి పర్యావరణాన్ని కాపాడుతున్న సముద్రపు తాబేళ్లు.. కడలి కలుషితం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా.. అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో సముద్రపు తాబేళ్ల కళేబరాలు కలకలం రేపాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సముద్రపు తాబేళ్ల కళేబరాలను చూసి స్థానికులు షాక్ అయ్యారు. సముద్రపు తాబేళ్ల మృతిపై అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే.. తీరంలో గుడ్లు పెట్టేందుకు వస్తూ మృత్యువాత పడినట్టు అనుమానం వ్యక్తం చేశారు అధికారులు.
సముద్రపు తాబేళ్ల మృతితో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలో ఆక్వా రసాయనాలు అధికంగా కలుస్తుండడంతోనే తాబేళ్లు మృతి చెందుతున్నట్లు ఆరోపిస్తున్నారు. నిబంధనలను ఉల్లంగించి చేపల వేట చేయడం వల్ల కూడా గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చే తాబేళ్లు బోట్ల కింద చనిపోతాయంటున్నారు. ఇక.. గతంలోనూ.. సముద్ర తీరంలో తాబేళ్లు మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..