AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: APPSC గ్రూప్‌-2లో నిబంధనల ఉల్లంఘన.. అధికారులకు ఫిర్యాదు! ఏం జరిగిందంటే..

ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పోటీ పరీక్షలు కూడా నిర్వహించింది. ఫిబ్రవరి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌ 2 పరీక్ష ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 24 జిల్లాల్లో దాదాపు 1327 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించారు. కాగా ఈ పరీక్ష రోజున కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ కేంద్రంలో నిబంధనల..

Andhra Pradesh: APPSC గ్రూప్‌-2లో నిబంధనల ఉల్లంఘన.. అధికారులకు ఫిర్యాదు! ఏం జరిగిందంటే..
APPSC Group 2 Exam
Srilakshmi C
|

Updated on: Mar 01, 2024 | 9:58 AM

Share

కర్నూలు, మార్చి 1: ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పోటీ పరీక్షలు కూడా నిర్వహించింది. ఫిబ్రవరి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూప్‌ 2 పరీక్ష ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 24 జిల్లాల్లో దాదాపు 1327 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించారు. కాగా ఈ పరీక్ష రోజున కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ కేంద్రంలో నిబంధనల ఉల్లంఘన జరిగిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదోనిలోని భాష్యం విద్యాసంస్థలో 6వ నెంబర్‌ గదికి ఇన్విజిలేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఓ వ్యక్తి ప్రశ్నపత్రాలను సీల్డ్‌ కవర్‌లో కాకుండా నేరుగా గదిలోకి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఆ గదిలో పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్ధులు దీనిపై అభ్యంతరాలు తెలిపారు.

ప్రశ్నపత్రాల కవర్లను పరీక్షకు ముందే ఇన్విజిలేటర్లకు ఇచ్చిన గదిలోనే తెరిచినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రశ్నపత్రానికి ఉండాల్సిన స్టిక్కర్‌ సీల్‌ కూడా లేదని గమనించిన అభ్యర్థులు ఇదే విషయమై ఇన్విజిలేటర్‌ను ప్రశ్నించారు. ముందుగానే సీల్‌ ఊడిపోయి ఉందని ఇన్విజిలేటర్‌ చెప్పినట్లు సమాచారం. పరీక్ష ముగిసిన తర్వాత ఆ గదిలో పరీక్ష రాసిన విద్యార్థులు ఈ విషయాన్ని అదేరోజు పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తించిన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ విషయం బయటికి రావడంతో పలుఅనుమానాలు తలెత్తుతున్నాయి.

కాగా ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్‌ 2 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీరిలో 87.17 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలతో పోల్చితే ఈ సారి గరిష్టంగా అభ్యర్ధులు గ్రూప్‌ 2 పరీక్షకు హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తం 897 పోస్టులకు గానూ ఎపీపీఎస్సీ గ్రూప్‌ 2 నియామక ప్రక్రియ చేపడుతోంది. ఎన్నో ఆశలతో గ్రూప్‌ 2 పరీక్షకు హాజరైన అభ్యర్ధులు కర్నూలులోని తాజా సంఘటన వెలుగులోకి రావడంతో ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..