AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage: ముహూర్తం సమయానికి వరుడు రాలేదనీ.. బావను ఉత్తుత్తి పెళ్లి చేసుకున్న వధువు! ఎందుకో తెలుసా..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సామూహిక వివాహ వేడుక పథకం కింద నూతన దంపతులకు ఆర్ధిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా నిర్వహించిన సామూహిక వివాహ వేడుకకు వరుడు వేళకు రాలేదని పథకం ప్రయోజనాల కోసం వధువు ఏకంగా తన బావను పెళ్లి చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వేదికగా..

Marriage: ముహూర్తం సమయానికి వరుడు రాలేదనీ.. బావను ఉత్తుత్తి పెళ్లి చేసుకున్న వధువు! ఎందుకో తెలుసా..
Uttar Pradesh Marriage Scheme
Srilakshmi C
|

Updated on: Feb 29, 2024 | 7:13 AM

Share

ఝాన్సీ, ఫిబ్రవరి 29: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝూన్సీలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సామూహిక వివాహ వేడుక పథకం కింద నూతన దంపతులకు ఆర్ధిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా నిర్వహించిన సామూహిక వివాహ వేడుకకు వరుడు వేళకు రాలేదని పథకం ప్రయోజనాల కోసం వధువు ఏకంగా తన బావను పెళ్లి చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వేదికగా జరిగిన సామూహిక వివాహ వేడుకలో 132 జంటలు మంగళవారం (ఫిబ్రవరి 28) పెళ్లి చేసుకున్నాయి. ఇందులో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వధూవరులు వచ్చారు. వీరిలో ఝాన్సీలోని బామౌర్‌కు చెందిన ఖుషీ అనే మహిళకు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్‌కు చెందిన వృషభన్‌తో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరి పేరుతో 36 నంబరు రిజిస్ట్రేషను నమోదైంది. కానీ ముహూర్తం సమయానికి అతడు మండపానికి చేరుకోలేదు. కానీ ముహూర్త సమయానికి పెళ్లి జరిగిపోయింది.

పెళ్లిపీటలపై ఖుషీ పక్కన వరుడిగా మరో కొత్త వ్యక్తి ఉండటం అధికారులు గమనించారు. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పెళ్లికుమారుడు వేళకు రాలేదని, పెద్దల సలహాతో తాను కూర్చొన్నట్లు నకిలీ వరుడు చెప్పాడు. అంతేకాకుండా అతడికి ఇదివరకే పెళ్లి అయ్యింది. వదువు ఖుషీకి వరుసకు బావ అవుతాడని తెలిసింది. ప్రభుత్వ పధకం ప్రయోజనాల కోసం ఈ డ్రామాకు తెరలేపినట్లు గ్రహించిన అధికారులు వెంటనే విచారణకు అదేశించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి లలితా యాదవ్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ క్రమంలో వధువు ఖుషీ కుటుంబానికి ఇచ్చిన అన్ని బహుమతులు, ఇతర సామగ్రిని వెనక్కి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా యూపీలో అమలు అవుతోన్న సీఎం సామూహిక వివాహ పథకం కింద కొత్తజంటలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.51 వేలు చొప్పున అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం నగదులో రూ.35 వేలు నేరుగా వధువు బ్యాంక్‌ ఖాతాకు వెళ్తుంది. దంపతులకు ఇచ్చే బహుమతుల కోసం రూ.10 వేలు, వేడుక ఏర్పాట్లకు మరో రూ.6 వేల వరకు ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కింద జరిగే వివాహాలకు, జంటల ఆధార్ కార్డులు సరిపోల్చడం, ఇతర వివరాలను ధృవీకరించడం జరుగుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు ఇప్పటికే పలుమార్లు ఆ రాష్ట్రంలో నకిలీ పెళ్లిళ్ల వ్యవహారాలు బయటపడ్డాయి. తాజాగా మరోమారు నకిళీ పెళ్లి వ్యవహారం బట్టబయలు కావడంతో కలకలం రేగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.