AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sowmya Janu: ‘నన్ను ఆ మాట అన్నాడు.. అందుకే సీరియస్ అయ్యా’ బంజారాహిల్స్‌ హోంగార్డుపై దాడి చేసిన సినీనటి సౌమ్య జాను!

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో రాంగ్‌ రూట్లో రావడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సిబ్బందిపై దాడి చేసిన యువతి మరెవరో కాదు సినీనటి సౌమ్య జానుగా బంజారాహిల్స్‌ పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ హోంగార్డు విఘ్నేష్‌ను బూతులు తిడుతూ, అతని చేతిలోని ఫోన్‌ లాక్కుని పగలగొట్టి నానా హంగామా సృష్టించింది. అంతటితో ఆగకుండా ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసి అతని షర్టు కూడా చింపేసిన..

Actress Sowmya Janu: 'నన్ను ఆ మాట అన్నాడు.. అందుకే సీరియస్ అయ్యా' బంజారాహిల్స్‌ హోంగార్డుపై దాడి చేసిన సినీనటి సౌమ్య జాను!
Actress Sowmya Janu
Srilakshmi C
|

Updated on: Feb 28, 2024 | 7:54 AM

Share

జూబ్లీహిల్స్‌, ఫిబ్రవరి 28: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో రాంగ్‌ రూట్లో రావడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సిబ్బందిపై దాడి చేసిన యువతి మరెవరో కాదు సినీనటి సౌమ్య జానుగా బంజారాహిల్స్‌ పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ హోంగార్డు విఘ్నేష్‌ను బూతులు తిడుతూ, అతని చేతిలోని ఫోన్‌ లాక్కుని పగలగొట్టి నానా హంగామా సృష్టించింది. అంతటితో ఆగకుండా ట్రాఫిక్ హోంగార్డుపై దాడి చేసి అతని షర్టు కూడా చింపేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఈనెల 24న రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ 12లోని అగ్రసేన్‌ కూడలిలో జరిగింది.

రాంగ్‌రూట్‌లో జాగ్వర్‌ కారులో వచ్చిన జాను.. అక్కడ విధుల్లో ఉన్న బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ హోంగార్డు విఘ్నేష్‌ ఆపి, వెనక్కి వెళ్లాలని కోరడంతో సౌమ్య జాను శివాలెత్తిపోయింది. కోపంతో బూతులు తిడుతూ.. అతని లైఫ్‌జాకెట్‌ చించివేసి, చేతిలోని ఫోన్‌ లాక్కొని పగులగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది కూడా. దీంతో ఆమెపై బంజారాహిల్స్ పోలీసులకు ట్రాఫిక్ హోంగార్డు విఘ్నేష్ ఫిర్యాదు చేయగా.. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఇంటి వద్ద అందుబాటులో లేదని పోలీసులు తెలిపారు. అలాగే ఆమెను ఫోన్ ద్వారా కూడా సంప్రదించలేక పోయామని, ఆచూకీని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

అంతా అబద్ధం.. కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చూడండి: సౌమ్య జాను

దీనిపై సౌమ్యజాను ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో వివరించింది. రాంగ్‌ రూట్లో వెళ్తే తప్పేంటని ప్రశ్నించిన జానూ ఇంటర్వ్యూలో మాత్రం యూటర్న్‌ తీసుకుని క్షమాపణలు కోరింది. తాను అత్యవసర వైద్యసహాయం నిమిత్తం రాంగ్‌రూట్‌లో వెళ్లానని, పోలీసులు క్షమించాలని కోరింది. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో మందుల కోసమని అలా వెళ్లాల్సి వచ్చిందని వివరించింది. అదే విషయం హోంగార్డుకు కూడా చెప్పానని, అతను పట్టించుకోకుండా అమర్యాదగా, అసభ్యంగా దూషించాడని.. అందువల్లనే తాను తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అసభ్య పదజాలంతో తనను తిట్టడం వల్లనే సహనం కోల్పోయినట్లు తెల్పింది. అతడిపై దాడి చేయలేదని, అంతా అబద్ధమని, పోలీసులు విచారణకు పిలవలేదని చెప్పింది. పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ పుటేజీ పరిశీలిస్తే అసలు ఎవరిది తప్పో తెలుస్తుందని సౌమ్య జాను పేర్కొంది. తన లాంటి సెలెబ్రిటీనే ఇలా దూషిస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. తాను కూడా హోంగార్డు మీద కేసు పెడతానని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కాగా సౌమ్య జాను చందమామ కథలు, లయన్, తడాఖా వంటి సినిమాల్లో నటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.