AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Scam: భారీ డిస్కౌంట్‌తో ఆన్‌లైన్‌లో ఆవులు.. తీరాచూస్తే! ఎంతమోసం..

భార‌త్‌లో డిజిటల్‌ వినియోగం వేగం పుంజుకుంటోంది. గాడ్జెట్ల నుంచి కిరాణా సరుకుల వరకు అన్నీ అందుబాటు ధరలో ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ స‌ర్వీసులన్నీ చట్టబద్ధమైనవే అని అనుకోవడం పొరపాటే అవుతుంది. డిజిటల్‌ లావాదేవాలకు, క్రయవిక్రయాలకు అలవాటుపడ్డ వినియోగదారులు లక్ష్యంగా స్కామర్లు మోసాలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న డిజిట‌ల్ వేదిక‌ల‌తో స్కామ‌ర్లు కూడా అమాయ‌కుల‌ను ల‌క్ష్యంగా..

Online Scam: భారీ డిస్కౌంట్‌తో ఆన్‌లైన్‌లో ఆవులు.. తీరాచూస్తే! ఎంతమోసం..
Online Scam
Srilakshmi C
|

Updated on: Feb 29, 2024 | 7:50 AM

Share

గుర్గావ్‌, ఫిబ్రవరి 29: భార‌త్‌లో డిజిటల్‌ వినియోగం వేగం పుంజుకుంటోంది. గాడ్జెట్ల నుంచి కిరాణా సరుకుల వరకు అన్నీ అందుబాటు ధరలో ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ స‌ర్వీసులన్నీ చట్టబద్ధమైనవే అని అనుకోవడం పొరపాటే అవుతుంది. డిజిటల్‌ లావాదేవాలకు, క్రయవిక్రయాలకు అలవాటుపడ్డ వినియోగదారులు లక్ష్యంగా స్కామర్లు మోసాలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న డిజిట‌ల్ వేదిక‌ల‌తో స్కామ‌ర్లు కూడా అమాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ వేదిక‌గా రెచ్చిపోతున్నారు. రోజుకో త‌ర‌హా స్కామ్‌తో టోక‌రా వేస్తూ అందిన‌కాడికి దోచుకుంటున్నారు. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ఓ పాడి రైతు ఆన్‌లైన్‌లో ఆవులను కొనుగోలు చేసేందుకు యత్నించి భారీ మొత్తంలో డబ్బును పోగొట్టుకున్నారు. అసలేం జరిగిందంటే..

గుర్గావ్‌లోని పాండాలాలో నివసిస్తున్న సుఖ్‌బీర్ (50 ) అనే పాడి రైతు ఆన్‌లైన్ స్కామ్‌లో మోస‌పోయాడు. ఆఫ్‌లైన్ రేట్స్‌తో పోలిస్తే చాలా త‌క్కవ ధ‌ర‌కు, భారీ రాయితీతో ఆన్‌లైన్‌లో ఆవుల‌ను విక్రయించే ప్రక‌ట‌న ఒకటి సుఖ్బీర్‌ను ఆకర్షించింది. ఆన్‌లైన్‌లో ఈ డీల్ గురించి విక్రయదారులతో సంప్రదించగా మొబైల్‌ వాట్సాప్‌కు ఆవుల ఫొటోలు పంపార‌ని, ఒక్కో ఆవును రూ. 35,000కు విక్రయిస్తామ‌ని ఆఫ‌ర్ చేశార‌ని సుఖ్బీర్ కుమారుడు పర్వీన్ (30) వెల్లడించాడు. పర్వీన్‌ ఫోన్‌ను తండ్రి వినియోగిస్తుంటాడని, ఆఫ్‌లైన్‌లో రూ.లక్షకు విక్రయించే ఆవులను ఆన్‌లైన్‌లో నాలుగు ఆవులను కేవలం రూ.95,000లకే అందించేందుకు విక్రయదారులు హామీ ఇచ్చినట్లు తెలిపాడు. ఇలా వారి బూటకపు మాటలను పూర్తిగా నమ్మిన సుఖ్బీర్‌ జనవరి 19, 20 తేదీల్లో రూ.22,999 చెల్లించాడు. దీంతో మరింత రెచ్చిపోయిన స్కామర్లు మరింత డబ్బు డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. వాస్తవంగా ఆవులు కొనుగోలు చేసేందుకు లేక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన సుఖ్బీర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ వ్యవ‌హ‌రం వెలుగుచూసింది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419 మరియు 420 కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.