AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘జోక్‌ ఏంట్రా..? నోరు అదుపులో పెట్టుకో’ లైవ్‌లోనే కమెడియన్‌ చెంప ఛెళ్లుమనిపించిన సింగర్‌

అదొక లైవ్ టీవీ షో.. అందరూ కమెడియన్‌ జోకులకు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. చిట్ చాట్ షో.. సరదాగా సాగుతుంది. ఇంతలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న కమెడియన్ సింగర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. అంతే కోపంతో సివంగిలా ఊగిపోయిన సింగర్‌.. లైవ్‌లోనే కెమెరా ముందే కమెడియన్‌ను తిడుతూ రెండు చెంపలు వాయించింది. ఈ షాకింగ్‌ ఘటన దాయాది దేశం పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో..

Viral Video: 'జోక్‌ ఏంట్రా..? నోరు అదుపులో పెట్టుకో' లైవ్‌లోనే కమెడియన్‌ చెంప ఛెళ్లుమనిపించిన సింగర్‌
Pakistani Singer Slaps Comedian
Srilakshmi C
|

Updated on: Feb 29, 2024 | 10:19 AM

Share

అదొక లైవ్ టీవీ షో.. అందరూ కమెడియన్‌ జోకులకు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. చిట్ చాట్ షో.. సరదాగా సాగుతుంది. ఇంతలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న కమెడియన్ సింగర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. అంతే కోపంతో సివంగిలా ఊగిపోయిన సింగర్‌.. లైవ్‌లోనే కెమెరా ముందే కమెడియన్‌ను తిడుతూ రెండు చెంపలు వాయించింది. ఈ షాకింగ్‌ ఘటన దాయాది దేశం పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలింతకీ ఏం జరిగిందంటే..

పాకిస్తాన్ దేశంలోని ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో ఎంటర్ టైన్‌మెంట్ లైవ్‌ షో నడుస్తుంది. ఈ షోకు పాక్‌ ఫేమస్‌ సింగర్ షాజియా మంజూరు, కామెడీ యాక్టర్ షెర్రీ నన్హా అతిధులుగా పాల్గొన్నారు. యాంకర్‌గా హైదర్ వ్యవహరిస్తున్నాడు. అప్పటి వరకు సరదాగా సాగిపోతున్న షోలో కామెడియన్‌ షెర్నీ.. సింగర్ షాజియాను ఉద్దేశిస్తూ ప్రాంక్ చేశాడు. అదే అతనిపాలిట పెను షాపలైంది. షాజియా నువ్వు, నేనూ పెళ్లి చేసుకుని హనీమూన్‌కు వెళ్లాలనుకుంటే నేను మోంటో కార్లో తీసుకెళ్తాను. ఎలా వెళితే బాగుంటుంది అంటూ ప్రాంక్ చేశాడు. షెర్రీ వ్యాఖ్యలతో సింగర్ షాజియాకు తీవ్ర స్థాయిలో చిర్రెత్తుకొచ్చింది. థార్డ్‌ క్లాస్‌ రా.. అంటూ కమెడియన్‌ను పట్టుకుని రెండు చెంపలు వాయించింది. ఈ ఊహించని పరిణామానికి యాంకర్‌తోపాటు మొత్తం సెట్‌లో ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. ప్రాంక్ అయితే మాత్రం ఇంత వల్గర్‌గా మాట్లాడుతావా.. నోటికి అడ్డూఅదుపు ఉండొద్దు. ప్రాంక్ అయితే మాత్రం విలువలు ఉండవా? మహిళలను ఏది పడితే అది అడుగుతారా? ఆడవాళ్లతో ఇలాగేనే మాట్లాడేది? అంటూ శివాలెత్తిపోయింది.

ఇవి కూడా చదవండి

కమెడియన్‌ను కొడుతుంటే ఆమెను అదుపు చేసేందుకు సెట్‌లో ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. రెండు నిమిషాల తర్వాత హోస్ట్ మొహ్సిన్ అబ్బాస్ హైదర్ జోక్యం చేసుకుని ఆమెను శాంతింప చేశాడు. ఇదంతా స్క్రిప్ట్‌లో భాగమేనని, అతని తప్పుఏమీ లేదని సర్దిచెప్పాడు. ప్రాంక్ స్క్రిప్ట్ అయినా ఓ లిమిట్ ఉండాలని, హద్దులు ఉంటాయంటూ కామెడియన్‌పై షాజియా అసహనం వ్యక్తం చేసింది. ఆ తర్వాత షాజియా కోపంతో స్టూడియో నుంచి బయటకు వచ్చేసి, ఇకపై ఈ షోలో పాల్గొనేది లేదని తెగేసి చెప్పి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు భిన్న విధాలుగా స్పందిస్తున్నారు. స్క్రిప్ట్‌ కోసం చేస్తే కథ అడ్డం తిగిరిందంటూ జోకులు పేలుస్తున్నారు. కాగా గతంలో ఇదే షోకు గెస్ట్‌గా వచ్చిన షాజియా హోస్ట్‌ మొహ్సిన్ అబ్బాస్ హైదర్‌పై ప్రాక్టికల్ జోక్ వేశారు. అంతా సరదాగా నవ్వుకున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.