Premalu OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళీ సూపర్ హిట్ ‘ప్రేమలు’.. తెలుగులోనూ చూడొచ్చు..

'ప్రేమలు'. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. లవ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ గా దూసుకుపోతుంది. సుమారు రూ. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యి దాదాపు రూ.63 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో స్ట్రీమింగ్ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

Premalu OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళీ సూపర్ హిట్ 'ప్రేమలు'.. తెలుగులోనూ చూడొచ్చు..
Premalu Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 29, 2024 | 10:21 AM

ఇటీవల మలయాళీ, తమిళ్ సినిమాలు సినీ ప్రియులకు ఎక్కువగా నచ్చేస్తున్నాయి. అక్కడి చిత్రాల కంటెంట్ ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ‘జో’ సినిమా ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుందో చెప్పక్కర్లేదు. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ మూవీ యూత్‏కు కనెక్ట్ అయ్యింది. దీంతో ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరో సినిమా పేరు కూడా నెట్టింట మారుమోగుతుంది. అదే ‘ప్రేమలు’. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. లవ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ గా దూసుకుపోతుంది. సుమారు రూ. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యి దాదాపు రూ.63 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టం ఖాయంగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ తో స్ట్రీమింగ్ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

మలయాళంలో సంచలనం సృష్టించిన ‘ప్రేమలు’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందని సమాచారం. ఈ మూవీ కోసం హాట్ స్టార్ భారీగానే వచ్చించిందని తెలుస్తోంది. అయితే ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. ప్రేమలు చిత్రాన్ని తెలుగులో నేరుగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ తెలుగు డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు టాక్. తెలుగు వెర్షన్ అధికారిక ప్రకటన ఇస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఎప్పుడు రిలీజ్ కానుందనే విషయాన్ని వెల్లడించలేదు. ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాను మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు.

ఇందులో నెల్సన్ కే గఫూర్, మమితా బైజు జంటగా నటించగా.. ఏడీ గిరీశ్ దర్శకత్వం వహించారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాను హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు డైరెక్టర్ గిరీశ్. విష్ణు విజయ్ సంగీతం అందించగా.. దిలీశ్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..