Tollywood: చారడేసి కళ్ల చిన్నారి.. అందంలో ఆమెకు పోటిలేరు.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?..

తెలుగు, తమిళం, మలయాళం భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత కథానాయికగానూ మెప్పించింది. ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల జోడిగా కనిపించింది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో ఒకరు. 90'sలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: చారడేసి కళ్ల చిన్నారి.. అందంలో ఆమెకు పోటిలేరు.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 29, 2024 | 9:28 AM

సోషల్ మీడియా ప్రపంచంలో సినీతారలకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు వైరలవుతుంటాయి. ఇటీవల కొంతకాలంగా సెలబ్రెటీల పర్సనల్ విషయాల గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఇక మరోవైపు తమ అభిమాన హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ఒకప్పటి సీనియర్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షి్స్తుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత కథానాయికగానూ మెప్పించింది. ఇప్పుడు సహాయ నటిగా రాణిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల జోడిగా కనిపించింది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో అగ్రకథానాయికలలో ఒకరు. 90’sలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. తనే సీనియర్ హీరోయిన్ మీనా..

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు మీనా. ఇప్పటికీ ఆమెకు భారీగా ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు అందరు హీరోల సరసన నటించింది. 1991 నుంచి 2000 వరకు దాదాపు ఒక దశాబ్దంపాటు స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి సరనస స్నేహంకోసం, వెంకటేష్ జోడిగా సుందరకాండ, చంటి, సూర్యవంశం, అబ్బాయిగారు సినిమాల్లో నటించింది. ఇక బాలకృష్ణతో ముద్దుల మొగుడు, బొబ్బిలి సింహం చిత్రాల్లో నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాల్లో బాలనటిగా నటించి ఆ తర్వాత రజినీ జోడిగా హీరోయిన్‏గా మెరిసింది.

1975 సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించింది మీనా. దాదాపు పదేళ్లపాటు సౌత్ సినీ పరిశ్రమలో అలరించిన మీనా..కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకుంది. వీరికి నైనికా అనే పాప జన్మించింది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీనా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తుంది. వెంకీ జోడిగా దృశ్యం సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్ లో చెన్నైలో అనారోగ్య సమస్యలతో మృతిచెందారు.

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.