AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone – Ranveer: గుడ్‏న్యూస్ చెప్పిన బాలీవుడ్ కపుల్.. తల్లికాబోతున్న దీపికా పడుకొణే..

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపూల్ అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‏లో తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలకనున్నట్లు హీరోయిన్ దీపికా పదుకొణె వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్ స్టాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో దీపికా, రణవీర్ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Deepika Padukone - Ranveer: గుడ్‏న్యూస్ చెప్పిన బాలీవుడ్ కపుల్.. తల్లికాబోతున్న దీపికా పడుకొణే..
Deepika Padukone, Ranveer
Rajitha Chanti
|

Updated on: Feb 29, 2024 | 10:48 AM

Share

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపూల్ అభిమానులతో శుభవార్త పంచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‏లో తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలకనున్నట్లు హీరోయిన్ దీపికా పదుకొణె వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్ స్టాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో దీపికా, రణవీర్ జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీపికా, రణవీర్ సింగ్ 2018లో వివాహం చేసుకున్నారు. కొన్నిరోజులు దీపికా ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరలయ్యాయి 77వ బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్ లో రెడ్ కార్పెట్‌పై మెరిసింది దీపికా. అదే సమయంలో ఆమె తన బేబీ బంప్ కవర్ చేసిందంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడ్డింది. సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన కోచర్ చీరలో కస్టమ్ జ్యువెల్లరీలో దీపికా మరింత కనిపించించి. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి అధికారికంగా ప్రకటించింది దీపికా.

ప్రస్తుతం దీపికా కల్కి 2898 AD చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది మే 9న రిలీజ్ కానుంది. కొన్నాళ్లుగా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గతేడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది దీపికా. ఇక ఇటీవలే హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమాలోనూ మెరిసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన దీపికా.. మొదట్లో వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఆ తర్వాత ఉపేంద్ర హీరోగా నటించిన ఐశ్వర్య సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాతి ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం మూవీలో ఛాన్స్ కొట్టింది. ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బీటౌన్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. అలాగే ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటిగా అవార్డ్స్ అందుకుంది. దీపికా ఫిల్మ్ కెరీర్ సాఫీగా సాగినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కోంది. రణబీర్ తో ప్రేమాయణం..బ్రేకప్ తో డిప్రెషన్ బారిన పడింది. ఒకానొక సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాని.. కానీ తన తల్లి తనకు ధైర్యం చెప్పడంతో తిరిగి సినిమాల్లో నటించానని గతంలో ఓ ఇంటర్వ్యులో చెప్పుకొచ్చింది దీపికా. 2013లో రామ్ లీల సినిమాలో రణవీర్ సింగ్ తో కలిసి నటించింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు రిలేషన్ షిప్ లో ఉన్న వీరు 2018 లో ఇటలీలో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.