Priyanka Chopra: ఈ వయసులోనూ ఏం ఫిట్‌నెస్ గురూ..! వావ్ అనిపిస్తున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక
ఇప్పుడు ఈ అమ్మడు హిందీలో సినిమాలు తగ్గించి.. హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. పెళ్లి తర్వాత సినిమాలు చేసిన ప్రియాంక కూతురు పుట్టిన తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది మరోసారి సినిమాలతో బిజీ అవ్వడానికి రెడీ అవుతుంది.

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. బాలీవుడ్ లో సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి గ్లోబల్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు హిందీలో సినిమాలు తగ్గించి.. హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. పెళ్లి తర్వాత సినిమాలు చేసిన ప్రియాంక కూతురు పుట్టిన తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ తో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది మరోసారి సినిమాలతో బిజీ అవ్వడానికి రెడీ అవుతుంది. దాంతో ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెటింది. జిమ్‌లో క్లిక్ చేసిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె ఫిట్‌నెస్ చూసి అభిమానులు వావ్ అంటున్నారు.
ప్రియాంక చోప్రా 2022లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి అయిన తర్వాత ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా కష్టమైన పని. ప్రియాంక చోప్రా నటి కాబట్టి ఫిట్‌నెస్ పై దృష్టి పెడుతుంది. అందుకే రాత్రి పగలు తేడా లేకుండా జిమ్‌లో కసరత్తు చేస్తుంది. ఇక ఇప్పుడు ప్రియాంక వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అవ్వడంతో పాటు ఇలా జిమ్ ఫోటోను షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రియాంక చోప్రా వయసు ప్రస్తుతం 41 ఏళ్లు. అయినా కూడా ఆమె చాలా ఫిట్ గా ఉంటుంది.
ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని పెళ్లాడి అమెరికాలో స్థిరపడింది. కాబట్టి వారు భారతదేశానికి చాలా అరుదుగా వస్తుంది ఈ చిన్నది. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటేనే ఇండియాకు వస్తుంది. హాలీవుడ్‌లో పలు ఫంక్షన్‌లు, పార్టీల్లో పాల్గొంటుంది ఈ అమ్మడు. ప్రియాంక చోప్రా మళ్లీ బాలీవుడ్‌లో సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికి అది నెరవేరేలా కనిపించడం లేదు. గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో ఏ సినిమా అంగీకరించలేదు ప్రియాంక. అంతే కాదు హిందీ చిత్ర పరిశ్రమపై ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి కారణమయ్యాయి.
ప్రియాంక చోప్రా 
ప్రియాంక చోప్రా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




