AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరగడుపున 1–2 గ్లాసుల నీరు.. శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!

మన శరీరంలో మూడింట రెండు వంతులు నీరే ఉంటుంది. కాబట్టి రోజంతా తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి చాలా అవసరం. అయితే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో నీళ్లు తాగే అలవాటు మన శరీరానికి ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలను అందిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య లాభాలేంటో వివరంగా తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Oct 31, 2026 | 6:56 AM

Share
శరీరం రీహైడ్రేట్ అవుతుంది: రాత్రంతా 7-8 గంటలు నిద్రపోతున్న సమయంలో మనం నీటిని తీసుకోము. దీనివల్ల ఉదయానికి శరీరం కొంతవరకు నిర్జలీకరణానికి గురవుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో 1-2 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరం వెంటనే రీహైడ్రేట్ అయి, అవయవాలన్నీ చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి.

1 / 5
జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం దూరం: పరగడుపున నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఉత్సాహవంతమవుతుంది. ప్రేగుల కదలికలు సులభతరమై, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమై కడుపులో ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు రావు.

2 / 5
విషపదార్థాల తొలగింపు: రాత్రంతా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, విషపదార్థాలను బయటకు పంపడంలో ఉదయం తాగే నీరు ఎంతో దోహదపడుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే నీరు తాగడం వల్ల శరీరంలోని లింఫాటిక్ వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది. ఇది క్రిములు, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

3 / 5
జీవక్రియ పెరిగి బరువు తగ్గుతారు: పరిశోధనల ప్రకారం, ఉదయాన్నే నీరు తాగడం వల్ల శరీరంలో జీవక్రియ రేటు సుమారు 24శాతం నుండి 30శాతం వరకు పెరుగుతుంది. ఇది క్యాలరీలను వేగంగా కరిగించి, బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో సహాయపడుతుంది.

4 / 5
ప్రకాశవంతమైన చర్మం: శరీరంలో విష వ్యర్థాలు బయటకు వెళ్లడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మం పొడిబారకుండా ఉండటానికి, ముడతలు తగ్గడానికి ఉదయం తాగే నీరు తేమను అందిస్తుంది.
ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసిన తర్వాత లేదా చేయకముందే 1 నుండి 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది. నీటిని ఒకేసారి వేగంగా తాగకుండా చిన్న చిన్న గుటకలుగా తాగడం శ్రేయస్కరం.

ప్రకాశవంతమైన చర్మం: శరీరంలో విష వ్యర్థాలు బయటకు వెళ్లడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మం పొడిబారకుండా ఉండటానికి, ముడతలు తగ్గడానికి ఉదయం తాగే నీరు తేమను అందిస్తుంది. ఉదయం లేచిన వెంటనే బ్రష్ చేసిన తర్వాత లేదా చేయకముందే 1 నుండి 2 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగడం చాలా మంచిది. నీటిని ఒకేసారి వేగంగా తాగకుండా చిన్న చిన్న గుటకలుగా తాగడం శ్రేయస్కరం.

5 / 5
Follow Us