AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? మీ పోలింగ్ కేంద్రం ఎక్కడో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండిలా..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే మీ పోలింగ్ బూత్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవడం చాాలా ముఖ్యం. మీ ఓటు ఏ పోలింగ్ బూత్‌లో ఉంది? ఏ పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలి? అనేది అవగాహన కలిగి ఉండాలి. మీరు సులువుగా ఇది తెలుసుకోవచ్చు

Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? మీ పోలింగ్ కేంద్రం ఎక్కడో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండిలా..
Polling Station
Venkatrao Lella
|

Updated on: Oct 31, 2026 | 10:21 AM

Share

ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. నవంబర్ 1వ తేదీన ఆదివారం రాష్ట్రంలో మున్సిపోల్స్ జరగనున్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో కొన్ని స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఆదివారం 92 పట్టణ స్థానిక సంస్థలకు పోలింగ్ నిర్వహించేందుకు అంతా సిద్దం చేశారు. 13 నగరపాలక సంస్దలు, 79 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో మొత్తం 2382 స్థానాలకు పోలింగ్ జగరనుంది. ఇందుకోసం 11,705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 99,36,114 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ స్థానాల్లో మొత్తం 6669 మంది పోటీలో ఉన్నారు. ఆదివారం మున్సిపల్ ఎన్నిక పోలింగ్ జరగనున్న క్రమంలో తాము ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం ఎక్కడుందనేది ఓటర్లు తెలుసుకోవాల్సిన అవసరమంది. ఆన్‌లైన్ ద్వారా ఎలా తెలుసుకోవాలనేది చూద్దాం.

పోలింగ్ కేంద్రం ఎలా తెలుసుకోవాలి..?

-ఏపీ ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ https://sec-ems.ap.gov.in/apsec/ తెరవాలి

-హోమ్ పేజీలో ఓటర్స్ పోర్టల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి

-అనంతరం నో యువర్ పోలింగ్ స్టేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి

-ఆ తర్వాత రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి

-మీ ప్రాంతాన్ని బట్టి అందులో ఒక ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి

-రూరల్ లోకల్ బాడీస్ సెలక్ట్ చేసుకుంటే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఆప్షన్లు కనిపిస్తాయి

-మీరు పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేస్తుంటే రూరల్ బాడీస్ ఆప్షన్ ఎంచుకోవాలి

-నగర పంచాయతీలు, మున్సిపాలిటీ, మున్సిపల్ కొర్పొరేషన్లు, వీఎంసీ, సీవీఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేవారు అర్బన్ లోకల్ బాడీస్ ఆప్షన్ ఎంచుకోవాలి

-అనంతరం మీ జిల్లా, మీ మండలం, మీ మున్సిపాలిటీ, పంచాయతీ, ఓటర్ ఐడీ నెంబర్ లేదా ఓటర్ సీరియల్ నెంబర్ వంటివి నమోదు చేయాలి

-అనంతరం క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేయాలి

-ఆ తర్వాత మీ పోలింగ్ కేంద్రం వివరాలు కనిపిస్తాయి.

హోరాహోరీగా ఎన్నికలు

కాగా ఏపీలో హోరాహోరీగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కొన్ని స్థానాల్లో పోటీ మరింత ఎక్కువగా ఉంది. దీంతో అల్లర్లు, ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.  36,351 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, వీడియో నిఘాతో పరిశీలించనున్నారు.

Follow Us