AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి రాధిక పనిమనిషి కొడుకు హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు

చెన్నైలో దారుణ హత్య వెలుగు చూసింది. ప్రముఖ సినీనటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్యకు గురయ్యాడు. బాధితుడి మామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఆ యువకుడిని హత్య చేసింది అతని స్నేహితులే అని తేలింది. దీంతో హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నటి రాధిక పనిమనిషి కొడుకు హత్య కేసులో బిగ్‌ ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు
Actress Radhikas Domestic Worker Son Murdered
Anand T
|

Updated on: Oct 31, 2026 | 9:43 AM

Share

ప్రముఖ సినీనటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. యువకుడిని హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని బన్రుట్టి ప్రాంతానికి చెందిన ఎళిల్‌సెల్వి అనే మహిళ చెన్నైలోని నటి రాధికా శరత్‌కుమార్‌ ఇంట్లో పని మనిషిగా వర్క్ చేస్తోంది. అయితే అమె 19 ఏళ్ల కుమారుడైన ప్రశాంత్ తన సొంతూరైన బన్రుట్టిలో ఉంటున్న తమ మామయ్య దగ్గర ఉంటూ టైల్స్‌ పని చేస్తున్నాడు.

అయితే ఈ నెల 27వ తేదీ ప్రశాంత్‌ చెన్నైలో ఉన్న తన తల్లిని కలిసేందుకు బన్రుట్టి నుంచి బయలుదేరాడు. అయితే తల్లిని కలిసిన తర్వాత ప్రశాంతి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన అతని మామయ్య రమేష్‌ వెంటనే పుదుప్పేట పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని కాల్‌ డేటాను పరిశీలించగా బన్రుట్టికి చెందిన దేవరాజు, దినేష్‌ అనే యువకులే ప్రశాంత్‌లో చివరిగా మాట్లాడినట్టు తేలింది.

దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ ప్రశాంత్‌కు స్నేహితులేనని తేలింది. గత నెల 27వ తేదీన వీరు ప్రశాంత్‌ని కలుద్దామని పొన్నేరి బీచ్‌కి తీసుకెళ్లి అక్కడ అతన్ని హత్య చేసి ఇసుకలో పాతిపెట్టినట్లు తెలిసింది. దీంతో నిందితుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రశాంత్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌ మార్టం నిమితం మార్చరీకి తరలించారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us