Holi 2024: లక్ష్మీదేవి అనుగ్రహానికి హోలీ రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకుని రండి.. సిరి సంపదలు మీ సొంతం

హోలీ రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల లక్ష్మీ దేవిని ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. దీని వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఉంటాయని.. ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదని విశ్వాసం. హోలీ రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలికా దహనం రోజున మీరు ఇంట్లోకి వెదురు మొక్కను తీసుకుని రండి. హోలీ రోజున ఇంట్లోకి వెదురు మొక్కను తీసుకురావడం శ్రేయస్కరం, లక్ష్మీ దేవి ప్రసన్నురాలవు తుందని నమ్ముతారు.

Holi 2024: లక్ష్మీదేవి అనుగ్రహానికి హోలీ రోజున ఈ వస్తువులను ఇంటికి తీసుకుని రండి.. సిరి సంపదలు మీ సొంతం
Holi 2024
Follow us
Surya Kala

|

Updated on: Mar 01, 2024 | 10:03 AM

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకునే హోలీ పండుగ ఆనందంతో నిండి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఎక్కువగా మార్చి రోజులలో వస్తుంది. హోలికా పూజ, హోలికా దహనం తర్వాత రంగులతో నిండిన హోలీ పండుగ వస్తుంది. ఈ పండగ కోసం ఏడాది పొడవునా ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తారు. పిల్లలు పెద్దలు సంతోషంగా హోలీని జరుపుకుంటారు.

హోలీ రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల లక్ష్మీ దేవిని ప్రసన్నం అవుతుందని నమ్ముతారు. దీని వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఉంటాయని.. ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదని విశ్వాసం. హోలీ రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం.

ఇంటికి వెదురు మొక్కను తీసుకురండి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలికా దహనం రోజున మీరు ఇంట్లోకి వెదురు మొక్కను తీసుకుని రండి. హోలీ రోజున ఇంట్లోకి వెదురు మొక్కను తీసుకురావడం శ్రేయస్కరం, లక్ష్మీ దేవి ప్రసన్నురాలవు తుందని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఇంటికి వెండి నాణేలు తీసుకురండి: దీపావళి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వెండి నాణేన్ని ఇంటికి తెచ్చినట్లే.. హోలీ రోజున వెండి నాణేన్ని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణించబడుతుంది, ఇది డబ్బు సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. నాణేన్ని ఎర్రటి గుడ్డలో కొన్ని బియ్యం గింజలతో కట్టి మీ ఇంట్లో భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు.

మెటల్ తాబేలు కొనుగోలు: హిందూ నమ్మకం ప్రకారం తాబేలు విష్ణువు అవతారంగా పరిగణించబడుతుంది. అందువల్ల హోలీ రోజున కుబేర యంత్రం లేదా శ్రీ యంత్రం ఉన్న లోహపు తాబేలును ఇంటికి తీసుకురండి. దీనిని ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీ దేవి సంతోషిస్తుందని నమ్ముతారు. దీనివల్ల జీవితంలో సుఖ సంపదలు లభిస్తాయని విశ్వాసం.

మామిడాకులు తో అలంకారం: నమ్మకం ప్రకారం హోలికా దహన సమయంలో కాల్చిన చెక్క బూడిద చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల ఆ బూడిదను ఇంట్లో చల్లుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ నశిస్తుంది. హోలీ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి లేదా అశోక ఆకుల కట్టను ఉంచడం ద్వారా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇది జీవితంలో ఆనందం, శాంతి, సిరి సంపదలు లభిస్తాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్