AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Mythology: రాత్రి వేళ గుడ్లగూబను చూస్తే శుభమా, అశుభమా.. ఏ రంగు గుడ్ల గూబని చూస్తే ఎలాంటి ఫలితం అంటే ?

వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే లేదా గుడ్ల గూబ కళ్లను మాత్రమే చూస్తే అది మీ జీవితంలో ఆనందానికి సంకేతం. జీవితం నుంచి ఆర్థిక సమస్యలు త్వరలో ముగుస్తాయనేడానికి ఇది సంకేతం అని నమ్మకం. ఏదైనా పని కోసం బయటకు వెళుతున్నట్లయితే.. ఇది మీకు శుభదాయకంగా ఉంటుంది. అంతేకాదు చేయబోయే పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుందని విశ్వాసం. 

Hindu Mythology: రాత్రి వేళ గుడ్లగూబను చూస్తే శుభమా, అశుభమా.. ఏ రంగు గుడ్ల గూబని చూస్తే ఎలాంటి ఫలితం అంటే ?
See An Owl At Night
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2024 | 12:37 PM

హిందూ మతంలో జంతువులు, పక్షులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శుభ..  అశుభ విషయాలను సూచించే అనేక నమ్మకాలు వీటికి సంబంధించినవి. పక్షుల్లో గుడ్లగూబకి కూడా హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. ఇవి తరచుగా రాత్రిపూట మాత్రమే ప్రజలకు కనిపిస్తాయి. సనాతన ధర్మంలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. గుడ్లగూబను చూడటం శుభం ..  అశుభం రెండింటికి సంకేతమని చాలా మంది నమ్ముతారు. కనుక ఈ రోజు గుడ్లగూబల గురించిన నమ్మకాలు ఏమిటో తెలుసుకుందాం..

ఎక్కువగా నలుపు లేదా గోధుమ రంగు గుడ్లగూబలను చూస్తారు. అయితే హిందూ గ్రంధాల ప్రకారం రాత్రిపూట తెల్ల గుడ్లగూబను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తెల్ల గుడ్లగూబ చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే తెల్ల గుడ్లగూబను చూస్తే జీవితంలో అన్ని సమస్యలు తీరిపోతాయని లేదా ఏదైనా శుభం జరగబోతోందనే విషయానికి సంకేతం అని నమ్మకం. హిందూ మతంలో తెల్ల గుడ్లగూబ మన పూర్వీకుల ఆత్మగా పరిగణించబడుతుంది. ఎవరైనా తెల్ల గుడ్లగూబను చూస్తే.. వారి పూర్వీకులు వారితో ఉన్నారని ఒక నమ్మకం ఉంది.

గుడ్లగూబలను తరచుగా చూడటం

వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే లేదా గుడ్ల గూబ కళ్లను మాత్రమే చూస్తే అది మీ జీవితంలో ఆనందానికి సంకేతం. జీవితం నుంచి ఆర్థిక సమస్యలు త్వరలో ముగుస్తాయనేడానికి ఇది సంకేతం అని నమ్మకం. ఏదైనా పని కోసం బయటకు వెళుతున్నట్లయితే.. ఇది మీకు శుభదాయకంగా ఉంటుంది. అంతేకాదు చేయబోయే పని ఖచ్చితంగా విజయవంతంగా పూర్తవుతుందని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

రోజు గుడ్లగూబ దర్శనం

గుడ్లగూబలు తరచుగా రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయని నమ్మకం. అయితే పగలు కనిపిస్తే శుభప్రదంగా పరిగణించబడుతుంది. జీవితంలో ఏదో మంచి జరగబోతోందని విశ్వాసం. గుడ్లగూబలు పిరికివి. చాలా తక్కువ మంది మాత్రమే వీటిని చూస్తారు. అయితే ఎవరైనా రాత్రి గుడ్లగూబను చూసినట్లయితే.. అది సమస్యల నుండి విముక్తికి సంకేతం. అంతేకాదు ఇది కెరీర్‌లో పురోగతిని కూడా సూచిస్తుంది. రాత్రి గుడ్లగూబ శబ్దం వినడం ఏదైనా శుభవార్త పొందడానికి సంకేతం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు