Green Lady: ఈ బామ్మకు గ్రీన్ కలర్ అంటే పిచ్చి.. ఏ రేంజ్‌లో అంటే ధరించే దుస్తుల నుంచి ప్రతిదీ ఆకుపచ్చగా ఉండాల్సిందే..

న్యూయార్క్‌లో నివసించే ఎలిజబెత్ స్వీట్‌హార్ట్ కు ఆకు పచ్చ రంగు అంటే ఇష్టం. ఎంతగా ఇష్టం అంటే ఆమె తన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని పూర్తిగా ఆకుపచ్చగా మార్చేసే విధంగా ఆకుపచ్చ రంగుని ఇష్టపడుతుంది. గ్రీన్ లేడీ అనే పేరుతో ప్రపంచం ఇప్పుడు ఆమెను గుర్తిస్తోంది. అంటే ఆమెకు ఆకు పచ్చ రంగు పట్ల ఉన్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. తన అభిరుచి కారణంగా  83 ఏళ్ల ఎలిజబెత్ తనను తాను మాత్రమే కాదు తన ఇంటిని ..  అందులో ఉంచిన వస్తువులను గ్రీన్ కలర్ గా మార్చేసింది.

Green Lady: ఈ బామ్మకు గ్రీన్ కలర్ అంటే పిచ్చి.. ఏ రేంజ్‌లో అంటే ధరించే దుస్తుల నుంచి ప్రతిదీ ఆకుపచ్చగా ఉండాల్సిందే..
Green Lady Of BrooklynImage Credit source: Instagram
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2024 | 11:40 AM

ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రకృతిలో అందాలను.. ఇష్టపడతారు, ప్రతి ఒక్కరూ రంగుల ప్రపంచంలో విహరించాలని కోరుకుంటారు. అయితే కొందరికి కొన్ని రంగులంటే ఇష్టం ఉంటుంది. అందుకు తగిన విధంగా తమకు నచ్చిన మనసు మెచ్చిన రంగుల దుస్తులను ధరిస్తారు. కొందరు తమకిష్టమైన రంగు కారు కొంటారు. అయితే సాధారణంగా పురుషులకు నీలం రంగు అంటే ఇష్టమని.. మహిళలకు పింక్ రంగు చాలా ఇష్టమైన రంగు అని నమ్ముతారు. అయితే ఈ ఇష్టాఅయిష్టాలు వ్యక్తిగతం. అయితే కొంతమందికి తాము ఇష్టపడిన రంగు పై ఏ రేంజ్ లో అభిమానం చూపిస్తారంటే.. తాము ధరించే దుస్తుల నుంచి ఇంటి రంగు, కారు రంగు ఇలా ప్రతిదీ తమకు నచ్చిన రంగులోనే ఉండాలని కోరుకుంటారు. అలాంటి ఓ మహిళ ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్లో చర్చనీయాంశమైంది.

న్యూయార్క్‌లో నివసించే ఎలిజబెత్ స్వీట్‌హార్ట్ కు ఆకు పచ్చ రంగు అంటే ఇష్టం. ఎంతగా ఇష్టం అంటే ఆమె తన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని పూర్తిగా ఆకుపచ్చగా మార్చేసే విధంగా ఆకుపచ్చ రంగుని ఇష్టపడుతుంది. గ్రీన్ లేడీ అనే పేరుతో ప్రపంచం ఇప్పుడు ఆమెను గుర్తిస్తోంది. అంటే ఆమెకు ఆకు పచ్చ రంగు పట్ల ఉన్న మక్కువను అర్థం చేసుకోవచ్చు. తన అభిరుచి కారణంగా  83 ఏళ్ల ఎలిజబెత్ తనను తాను మాత్రమే కాదు తన ఇంటిని ..  అందులో ఉంచిన వస్తువులను గ్రీన్ కలర్ గా మార్చేసింది. సోఫా, డిన్నర్‌వేర్, కౌంటర్ టాప్‌లు, బ్లెండర్‌తో సహా ప్రతి ఫర్నిషింగ్ వస్తువులు, గృహోపకరణం ఇలా ఇంట్లో ఉన్న ప్రతిదీ ఆకుపచ్చగా ఉంటాయి.

ఈ రంగునే ఎందుకు ఇష్టపడిందంటే..

ఇప్పుడు ఈ హాబీ గురించి మీడియాతో మాట్లాడుతూ.. మనిషిని సంతోషంగా ఉంచడంలో రంగులు ఎంతగానో సహకరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని, అయితే కొన్ని ఇష్టమైన రంగులు మీ మూడ్‌ని పూర్తిగా మార్చేస్తాయని, అలాంటిదే తనకు గ్రీన్ కలర్‌తో అనుబంధం అని చెప్పారు ఎలిజబెత్. తాను ఈ రంగును చూసిన వెంటనే మనస్సు సంతోషిస్తుంది. లోపల నుంచి ఒక స్థాయి శక్తి వస్తుందని పేర్కొంది. అంతేకాదు  రంగుతో ఉన్న సూత్రం ఏమిటంటే.. మీకు ఏది నచ్చితే అది మీ సొంతం చేసుకోండి .. తాను కూడా అదే చేసినట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఆకుపచ్చ రంగు పట్ల ఎలిజబెత్ ప్రేమ నిజ జీవితంలో, ఆన్‌లైన్‌లో ప్రజలనుఅమితంగా ఆకర్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదు లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ప్రజలు అద్భుతంగా ఉంటారు..  వారు తనని  చూసినప్పుడు నవ్వుతారు. సంతోషంగా ఉంటారు. ఫోటోలు తీయడానికి ఇష్టపడతారు. సెల్ఫీలు తీసుకుంటారు. అంతేకాదు మేము ఒకరినొకరు కౌగిలించుకుంటాము ఇది చాలా సానుకూలంగా ఉంటుందని తన అనుభవాలను పంచుకుంది ఎలిజబెత్.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..