Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జలుబు జ్వరం అనుకుంది ప్రమాదకరమైన వ్యాధిగా మారి.. శాశ్వతంగా వికలాంగురాలిని చేసింది

కొన్నిసార్లు ప్రజలు వ్యాధులను.. దాని తీవ్రత అర్థం చేసుకోలేరు. సాధారణ వ్యాధులుగా అనిపించేవి కొన్ని సార్లు వాస్తవానికి ప్రమాదకరమైనవి.. అవి ప్రాణాలను కూడా తీయగలవు లేదా వారిని వికలాంగులను చేయగలవు. అమెరికాలో ఓ మహిళ విషయంలో అలాంటిదే జరిగింది. జలుబు అని ఆమె అనుకున్నది... ప్రమాదకరమైన వ్యాధిగా మారింది.. ఆమెను శాశ్వతంగా వికలాంగురాలిని చేసింది. వివరాల్లోకి వెళ్తే..  

జలుబు జ్వరం అనుకుంది ప్రమాదకరమైన వ్యాధిగా మారి.. శాశ్వతంగా వికలాంగురాలిని చేసింది
Us Woman TeacherImage Credit source: Facebook/KPRC2 Re'Chelle Turner
Follow us
Surya Kala

|

Updated on: Mar 08, 2024 | 12:56 PM

జలుబు, దగ్గు సర్వసాధారణం. వాతావరణం మారిన వెంటనే.. జలుబు, దగ్గు వంటి వ్యాధుల బారిన పడడం సర్వ సాధారణం. అయితే కొందరు సాధారణ సీజనల్ వ్యాధులను పెద్దగా సీరియల్ గా తీసుకోరు. అయితే కొందరు శరీరంలో ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే వైద్యుల వద్దకు పరిగెడతారు. అయితే కొన్నిసార్లు ప్రజలు వ్యాధులను.. దాని తీవ్రత అర్థం చేసుకోలేరు. సాధారణ వ్యాధులుగా అనిపించేవి కొన్ని సార్లు వాస్తవానికి ప్రమాదకరమైనవి.. అవి ప్రాణాలను కూడా తీయగలవు లేదా వారిని వికలాంగులను చేయగలవు. అమెరికాలో ఓ మహిళ విషయంలో అలాంటిదే జరిగింది. జలుబు అని ఆమె అనుకున్నది… ప్రమాదకరమైన వ్యాధిగా మారింది.. ఆమెను శాశ్వతంగా వికలాంగురాలిని చేసింది. వివరాల్లోకి వెళ్తే..

మంచులా గడ్డకట్టడం ప్రారంభించిన చేతులు, కాళ్ళు 

ఈ మహిళ పేరు షెర్రీ మూడీ. షెర్రీ వయస్సు 51 సంవత్సరాలు. అమెరికాలోని టెక్సాస్ నివాసి. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. షెర్రీ ఒక పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. ఒక రోజు స్కూల్ స్టూడెంట్స్ తో కలిసి విహారయాత్రకు వెళ్లగా.. అక్కడ షెర్రీకి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అకస్మాత్తుగా చేతులు, కాళ్ళు  చల్లగా మారడం ప్రారంభించాయి. మంచులా గడ్డకట్టినట్లు అనిపించింది. జలుబు, జ్వరమే కదా తగ్గుతుందని షెర్రీ భావించింది. అయితే ఐదు రోజుల్లోనే షెర్రీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇన్‌ఫెక్షన్‌ తో రెండు కాళ్లు, చేతులు తీసెయ్యాల్సిన పరిస్థితి

షెర్రీ ని పరీక్షించిన వైద్య బృందం షాక్ ఇచ్చే వార్త చెప్పింది. వైద్యులు షెర్రీ స్ట్రెప్టోకోకస్ అని పిలువబడే ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్‌ బారిన పడినట్లు చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్ ఆమె శరీరం పూర్తిగా వ్యాపించింది. దీంతో ఆమె రెండు చేతులు, రెండు కాళ్లను తీసెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా చేతులు, కాళ్లు తీసెయ్యకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటారని వైద్యులు చెప్పారు. ఇలా షెర్రీ కి వచ్చిన వైరస్ ఆమెను  శాశ్వతంగా వీల్ చైర్‌లో కూర్చోబెట్టింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..