AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Shivaratri: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఎక్కడ ఉంది? అర్జునుడితో సంబంధం ఏమిటో తెలుసా..

వేల సంవత్సరాల క్రితం పాండవ సోదరులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. నిజానికి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను వధించిన తర్వాత సోదరహత్య, బ్రాహ్మణహత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించారు. ఆ సమయంలో వ్యాస మహర్షి పాండవులను శివుడు క్షమించినప్పుడే పాపం నుండి విముక్తులవుతారని చెప్పాడు. దీంతో పాండవులు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి, శివుడిని అనుగ్రహం కోసం బయలుదేరారు. అప్పుడు పాండవులు శివుడిని వెతకడం ప్రారంభించి హిమాలయాలకు చేరుకున్నారు. యుద్ధంలో యితే పాండవులు దోషులని భావించిన శివుడు నంది రూపం ధరించి పాండవులను తప్పించుకున్నాడు.

Maha Shivaratri: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఎక్కడ ఉంది? అర్జునుడితో సంబంధం ఏమిటో తెలుసా..
Tungnath Temple
Surya Kala
|

Updated on: Mar 08, 2024 | 11:13 AM

Share

హిందూమతంలోని త్రిమూర్తులలో శివుడు ఒకరు.  దేవదేవుడైన శివుడు లయకారుడు. భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు అనేక శివాలయాలు కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఏంటో తెలుసా? ఇది ఉత్తరాఖండ్‌లోని తుంగనాథ్ ఆలయం. శివుని ఐదు కేదార క్షేత్రాల్లో తుంగనాథ్ ఒకటి. ఉత్తరాఖండ్‌లో ఉన్న 5 పురాతన, పవిత్ర దేవాలయాలను పంచ కేదార క్షేత్రాలు అంటారు. మహా శివరాత్రి సందర్భంగా అత్యంత ఎత్తైన శివాలయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

తుంగనాథ్ ఆలయం 3,680 మీటర్ల (12,073 అడుగులు) ఎత్తులో చంద్రనాథ్ పర్వతం మీద ఉంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది.  తుంగనాథ్ అంటే సాహిత్య అర్థం పర్వతాల ప్రభువు. తుంగనాథ్‌ను సందర్శించాలంటే సోన్‌ప్రయాగ్ చేరుకోవాలి. తరువాత గుప్తకాశీ, ఉఖిమత్, చోప్తా మీదుగా తుంగనాథ్ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయ చరిత్ర మహాభారతం అంత పురాతనమైనది. పురాణ గ్రంధాల ప్రకారం పాండవ సోదరుల్లో మధ్యముడైన అర్జునుడు ఈ తుంగనాథ్ ఆలయాన్ని నిర్మించాడు.

ఇవి కూడా చదవండి

తుంగనాథ్ ఆలయానికి సంబంధించిన మహాభారత పురాణ కథ

తుంగనాథ్ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రసిద్ధ కథనం ఉంది. వేల సంవత్సరాల క్రితం పాండవ సోదరులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. నిజానికి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను వధించిన తర్వాత సోదరహత్య, బ్రాహ్మణహత్య చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భావించారు. ఆ సమయంలో వ్యాస మహర్షి పాండవులను శివుడు క్షమించినప్పుడే పాపం నుండి విముక్తులవుతారని చెప్పాడు. దీంతో పాండవులు తమ రాజ్యాధికారాన్ని తమ బంధువులకు అప్పగించి, శివుడిని అనుగ్రహం కోసం బయలుదేరారు. అప్పుడు పాండవులు శివుడిని వెతకడం ప్రారంభించి హిమాలయాలకు చేరుకున్నారు. యుద్ధంలో యితే పాండవులు దోషులని భావించిన శివుడు నంది రూపం ధరించి పాండవులను తప్పించుకున్నాడు. శివుడు భూగర్భంలోకి వెళ్ళాడు. తరువాత అతని శరీర భాగాలు నంది ఐదు వేర్వేరు ప్రదేశాలలో దర్శనం ఇచ్చాయి.

అపురూపమైన భారతదేశం!

ఈ అవయవాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ పాండవులు శివాలయాలు నిర్మించారు. ఈ ఐదు గొప్ప శివాలయాలను ‘పంచ కేదార క్షేత్రాలు’ అంటారు. ప్రతి ఆలయం శివుని శరీరంలోని ఒక భాగంతో గుర్తించబడుతుంది. తుంగనాథ్ పంచకేదార్లలో మూడవది (తృతీయకేదార్) తుంగనాథ్ ఆలయ స్థలంలో శివుని చేతులు కనుగొనబడ్డాయి. దీని ఆధారంగానే దేవాలయం పేరు వచ్చింది. తుంగ అంటే చేయి ..  నాథ్ అంటే శివుడు అని అర్ధం.

తుంగనాథ్ ఆలయంతో పాటు ‘పంచ కేదార్’లో కేదార్‌నాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్ ఉన్నాయి. కేదార్‌నాథ్‌లో భగవంతుని మూపురం కనిపించింది. రుద్రనాథ్‌లో అతని తల, మధ్యమహేశ్వర్‌లో పొత్తికడుపు, కల్పేశ్వర్ లో వెంట్రుకలు దర్శనం ఇచ్చాయి.

చలికాలంలో పూజారులు ఇతర ప్రాంతాలకు వెళతారు

చలికాలంలో ఈ ప్రదేశం మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ సమయంలో ఆలయం మూసివేయబడుతుంది పూజారుల ప్రతీకాత్మక  శివయ్య విగ్రహాన్ని ముక్కుమట్‌కు తీసుకువెళతారు. ఈ ప్రదేశం ప్రధాన ఆలయానికి 19 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సమయంలో గ్రామస్థులు శివుడిని వాయిద్యాల నడుమ తరలిస్తారు. తిరిగి  వేసవిలో ఆలయంలో ఉంచుతారు. భక్తులు ఏప్రిల్ , నవంబర్ మధ్య ప్రధాన ఆలయాన్ని సందర్శించవచ్చు.

శ్రీ రాముడితో తుంగ నాథ్ బంధం

పురాణాలలో రాముడితో తుంగ నాథ్ కు సంబంధం ఉందని పేర్కొంది. తుంగనాథ్‌కు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రశిల వద్ద ధ్యానం చేసేందుకు శ్రీరాముడు వచ్చాడు. లంక రాజైన రావణుడిని చంపిన తరువాత శ్రీరాముడు బ్రహ్మ హత్య పాతకం నుంచి విముక్తి పొందేందుకు చంద్రశిల కొండపై కొంతకాలం తపస్సు చేశాడు. చంద్రశిల శిఖరం 14 వేల అడుగుల ఎత్తులో ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ కిల్క్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు