Women’s Day: మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు, ప్రాముఖ్యత ఏమిటి, 2024 థీమ్ తెలుసుకోండి

స్త్రీ పురుషుల మధ్య సమానత్వం చర్చలు, పేపర్లలో ప్రస్తావనకు .. డిబేట్స్ కు పరిమితం అవుతుంది. ఆధునిక యుగంలో కూడా సమానత్వం సాధ్యం కావడం లేదు. గృహిణి లేకుండా ఇల్లు నడపడం అసాధ్యం..  అయినప్పటికీ మహిళ తన ప్రాముఖ్యతను నిరూపించుకోవాల్సి వస్తోంది. మహిళల పోరాటం, కృషి,  ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

Women's Day: మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు, ప్రాముఖ్యత ఏమిటి, 2024 థీమ్ తెలుసుకోండి
Women's DayImage Credit source: pexels
Follow us

|

Updated on: Mar 08, 2024 | 10:08 AM

21వ శతాబ్దంలో జీవిస్తున్నాం.. నేటి యువత ఆధునిక ఆలోచనలతో ముందుకుసాగాలని భావిస్తోంది. తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ నేటికీ ప్రపంచవ్యాప్తంగా  చాలా మంది మనస్సులో పురుషాధిక్యత గురించి ఆలోచన ఇప్పటికీ ప్రబలంగా ఉంది.  ఇప్పటికీ  ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ తనను తాను నిరూపించుకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భారతదేశంలో ఆడపిల్లలు బాల్య వివాహాలకు మాత్రమే కాదు కట్న కానుకలకు బలిపశువులవుతూనే ఉన్నారు. కొన్ని చోట్ల చదువుకున్న స్త్రీ కూడా తన విలువను చాటుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది.

స్త్రీ పురుషుల మధ్య సమానత్వం చర్చలు, పేపర్లలో ప్రస్తావనకు .. డిబేట్స్ కు పరిమితం అవుతుంది. ఆధునిక యుగంలో కూడా సమానత్వం సాధ్యం కావడం లేదు. గృహిణి లేకుండా ఇల్లు నడపడం అసాధ్యం..  అయినప్పటికీ మహిళ తన ప్రాముఖ్యతను నిరూపించుకోవాల్సి వస్తోంది. మహిళల పోరాటం, కృషి,  ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి హక్కుల గురించి అవగాహన కల్పించడానికి మహిళా దినోత్సవం ప్రారంభించబడింది. ఈ రోజు మహిళ దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యత, 2024 థీమ్ గురించి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ఈ రోజు జరుపుకోవడానికి చరిత్ర 1908వ సంవత్సరంతో ముడిపడి ఉందని చెబుతారు. నివేదికల ప్రకారం 20వ శతాబ్దంలో అమెరికా, ఐరోపాలో కార్మికుల ఉద్యమం మధ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టింది. ఆ రోజుకి పూర్తి గుర్తింపు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. మహిళలు తమ పనివేళలపై పరిమితి విధించాలని ఉద్యమంలో కోరారు. మొదటి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. స్త్రీ పురుషుల హక్కుల మధ్య ఉన్న వివక్షకు వ్యతిరేకంగా మహిళలు ఎలా తమ స్వరం పెంచారో మహిళా దినోత్సవం తెలియజేస్తుంది.

మహిళా దినోత్సవం ప్రాముఖ్యత

మహిళా దినోత్సవం ద్వారా మహిళల పోరాటంపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న అన్యాయం, సమాజంలో వారి పాత్ర , వారి సమాన హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచం ఆధునికంగా మారి ఉండవచ్చు కానీ చాలా మంది మహిళలు ఇప్పటికీ పురుషుల నిర్ణయాలపైనే ఆధారపడవలసి ఉంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2024 థీమ్

1955లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ప్రారంభించి..అధికారికంగా గుర్తించబడింది. దీని తరువాత 1996 నుంచి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ తో సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభమైంది. ఈ సంవత్సరం 2024లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ ‘ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్’గా ఉంచబడింది. ప్రతి రంగంలోనూ మహిళల ఉనికి అవసరమని, అయితే ఆ ఉనికి ఎందుకు లేదనేది ఈ థీమ్ లక్ష్యం.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..