Rudraksha: రుద్రాక్ష ప్రాముఖ్యత శివయ్య అనుగ్రహం కోసం ధరించే ముందు ఈ నియమాలు తెలుసుకోండి..

శివుని కన్నీళ్ల నుండి రుద్రాక్ష ఉద్భవించిందని నమ్మకం. ఈ కారణంగా హిందూ మతంలో రుద్రాక్ష అద్భుతంగా, అతీంద్రియంగా పరిగణించబడుతుంది. రుద్రాక్షలు ఒక ముఖి నుండి ఇరవై ఒక్క ముఖి వరకు కనిపిస్తాయి. వీటి సొంత, విభిన్న ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి నియమ నిబంధనల ప్రకారం రుద్రాక్షను ధరిస్తే.. తను అన్ని రకాల కష్టాల నుండి బయటపడతాడు. అంతేకాదు  జాతకంలో గ్రహాల స్థానం కూడా బలపడుతుంది. 

Rudraksha: రుద్రాక్ష ప్రాముఖ్యత శివయ్య అనుగ్రహం కోసం ధరించే ముందు ఈ  నియమాలు తెలుసుకోండి..
Rudraksha
Follow us

|

Updated on: Mar 08, 2024 | 9:22 AM

ప్రస్తుత కాలంలో ఎవరైనా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా సంతోషంగా సాగిపోవాలని  కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే రుద్రాక్షను ధరించాలని ఆలోచిస్తున్నట్లయితే.. ముందుగా రుద్రాక్షను ధరించే నియమాలను తెలుసుకోవాలి.  రుద్రాక్షను ధరించే ముందు కొన్ని  నియమాలను పాటిస్తే శుభ ఫలితాలను పొందుతారు. పురాణ గ్రంధాల ప్రకారం హిందూ మతంలో రుద్రాక్షకు చాలా ప్రాముఖ్యత ఉంది. రుద్రాక్ష శివునికి చాలా ప్రీతికరమైనదని నమ్మకం. ఈ కారణంగా, రుద్రాక్షను ధరించిన వ్యక్తి దేవుని నుంచి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతాడు.

మత విశ్వాసాల ప్రకారం శివుని కన్నీళ్ల నుండి రుద్రాక్ష ఉద్భవించిందని నమ్మకం. ఈ కారణంగా హిందూ మతంలో రుద్రాక్ష అద్భుతంగా, అతీంద్రియంగా పరిగణించబడుతుంది. రుద్రాక్షలు ఒక ముఖి నుండి ఇరవై ఒక్క ముఖి వరకు కనిపిస్తాయి. వీటి సొంత, విభిన్న ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి నియమ నిబంధనల ప్రకారం రుద్రాక్షను ధరిస్తే.. తను అన్ని రకాల కష్టాల నుండి బయటపడతాడు. అంతేకాదు  జాతకంలో గ్రహాల స్థానం కూడా బలపడుతుంది.

సతీదేవి అగ్నిప్రవేశం చేసి తన దేహాన్ని త్యాగం చేసిన తర్వాత శివుని కంట కన్నీరు వచ్చాయని, ఆ కన్నీళ్లు భూమిపై చాలా ప్రదేశాలలో పడి, వాటి నుండి ప్రకృతికి ఒక అద్భుత అంశం లభించిందని పురాణాలలో పేర్కొనబడింది. అదే రుద్రాక్ష రూపం. నియమాలు, ఆచారాల ప్రకారం రుద్రాక్షను ధరించిన వ్యక్తి జీవితంలో  బాధలు దూరం అవుతాయి. శివుని ఆశీస్సులు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

రుద్రాక్ష ధరించడానికి నియమాలు

  1. ఎవరైనా రుద్రాక్షను ధరించే సమయంలో మొదట రుద్రాక్ష మంత్రం, రుద్రాక్ష మూల మంత్రాన్ని 9 సార్లు జపించాలి. అంతేకాదు రుద్రాక్షను పవిత్ర స్థలంలో మాత్రమే ఉంచాలని గుర్తుంచుకోవాలి.
  2. హిందూ మతంలో రుద్రాక్షను తులసి జపమాల వలె పవిత్రంగా భావిస్తారు. అందువల్ల దీనిని ధరించిన తర్వాత మాంసం లేదా మద్యం తీసుకోవద్దు.
  3. రుద్రాక్షను శ్మశాన వాటికకు తీసుకెళ్లకూడదు. అంతేకాదు నవజాత శిశువు పుట్టినప్పుడు లేదా నవజాత శిశువు జన్మించిన ప్రదేశంలో రుద్రాక్షను ధరించి సంచరించరాదు.
  4. స్నానం చేయకుండా రుద్రాక్షను తాకకూడదు. స్నానం చేసిన తర్వాత శుద్ధి చేసిన తర్వాత మాత్రమే రుద్రాక్షను ధరించండి. దీనితో పాటు, ‘ఓం నమః శివాయ’ అనే శివ మంత్రాన్ని జపిస్తూ ఉండండి.
  5. ఎరుపు లేదా పసుపు దారంలో రుద్రాక్షను ధరించడం ఎల్లప్పుడూ శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  6. నలుపు రంగు దారంతో దీన్ని ఎప్పుడూ ధరించవద్దు. ఇలా చేయడం వలన ప్రతికూల ప్రభావం పడుతుంది.
  7. రుద్రాక్ష జపమాల ధరించిన తరువాత.. దీనిని మరెవరికీ ఇవ్వకండి. అదే సమయంలో మరొకరు ఇచ్చిన రుద్రాక్ష జపమాల ధరించవద్దు.
  8. రుద్రాక్షను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూసల రంధ్రాలలో దుమ్ము, ధూళి పేరుకుపోకుండా వీలైనంత వరకూ తరచుగా వాటిని శుభ్రం చేయండి.
  9. రుద్రాక్ష దారం మురికిగా లేదా పాడైపోయినట్లయితే దానిని మార్చండి. శుభ్రపరిచిన తర్వాత.. రుద్రాక్షను గంగా జలంతో శుభ్రం చేయండి. ఇలా చేయడం వలన స్వచ్ఛతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

జపించాల్సిన మంత్రం

రుద్రాక్ష ధరించే ముందు దానిని శుద్ధి చేయడం  చాలా ముఖ్యం. రుద్రాక్షను సోమవారం, మహాశివరాత్రి లేదా శ్రావణ మాసంలో ఏ రోజులోనైనా ధరించవచ్చు. ముందుగా వెండి లేదా రాగి గిన్నెలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తీసుకుని కలపాలి. ఈ మిశ్రమంలో రుద్రాక్షకు స్నానం చేయంచండి. స్నానం తర్వాత, స్వచ్ఛమైన నీటితో, గంగాజలంతో మళ్లీ శుద్ధి చేసి పూజా స్థలంలో ఎర్రటి వస్త్రం మీద ఉంచి, ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి ..  ॐ नमः शिवाय, या ॐ हूं नमः ఈ మంత్రాన్ని 501 లేదా 1100 సార్లు జపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ కిల్క్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!