Maha Shivaratri: శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం.. సకల పాపాలను హరించే క్షేత్రం గురజాలలో నేటి నుంచి శివరాత్రి జాతర ఉత్సవాలు..

కర్నూల్ జిల్లాలోని నందవరం మండలం గురజాల గ్రామము ఒకప్పుడు దండకారణ్యం. త్రేతాయుగంలో రావణాసురుడుని సంహారం అనంతరం శ్రీరాముడుకి బ్రహ్మహత్యాపాతకం అనే దోషం కలగటం తో శివలింగానికి పూజచేయాల్సి న అవసరం ఏర్పడింది. అయితే ఆ ప్రదేశంలో శివ లింగం లేకపోవడం తో శ్రీరాముడి ఆజ్ఞతో హనుమంతుడు కాశీకి లింగం కోసం వెళతాడు.

Maha Shivaratri: శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం.. సకల పాపాలను హరించే క్షేత్రం గురజాలలో నేటి నుంచి శివరాత్రి జాతర ఉత్సవాలు..
Gurazala Sri Ramalingeswara Swamy
Follow us
J Y Nagi Reddy

| Edited By: Surya Kala

Updated on: Mar 08, 2024 | 11:31 AM

దేవుడు లాంటి మనుషులు అక్కడక్కడా ఉంటారు. అచ్చమైన మనిషి లాంటి దేవుడు మాత్రం ఒకే ఒక్కడు పరమశివుడు.. శివతత్వాన్ని జీవితాలకు అన్వయించుకుంటే ముక్తి సిద్దిస్తుందో లేదో కానీ, మానవత్వం మాత్రం పరిపూర్ణనంగా సంతృప్తినిస్తుంది. మహాశివరాత్రి సందర్బంగా తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాదిలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాల్లో అతి పురాతన శైవ క్షేత్రం గురజాల. ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. శ్రీరాముడు సీతాదేవి స్వయంగా నిర్మించిన ఇసుక లింగం ఇక్కడి ప్రత్యేకత. శ్రీశైలం తరువాత అంతటి ప్రాముఖ్యత ఉన్న గురజాల రామలింగేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం..

కర్నూల్ జిల్లాలోని నందవరం మండలం గురజాల గ్రామము ఒకప్పుడు దండకారణ్యం. త్రేతాయుగంలో రావణాసురుడుని సంహారం అనంతరం శ్రీరాముడుకి బ్రహ్మహత్యాపాతకం అనే దోషం కలగటం తో శివలింగానికి పూజచేయాల్సి న అవసరం ఏర్పడింది. అయితే ఆ ప్రదేశంలో శివ లింగం లేకపోవడం తో శ్రీరాముడి ఆజ్ఞతో హనుమంతుడు కాశీకి లింగం కోసం వెళతాడు. ముహూర్త సమయానికి హనుమంతుడు చేరుకోకపోవడం తో ఇక్కడే తుంగభద్ర నది ఒడ్డున హనుమంతుడి కోసం ఎదురు చూస్తున్న శ్రీరాముడు సీతాదేవిల చేతుల మీదుగా తుంగభద్ర నది ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని, ప్రతిష్టించి, ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేసినట్లు చరిత్ర చెబుతుంది. అయితే కాశీ నుండి గురజాల కు చేరుకున్న హనుమంతుడు తన లింగానికి పూజచేయలేదని మనస్తాపం చెందడం తో శ్రీరాముడు హనుమంతుని లింగాన్ని కూడా ప్రతిష్టించినట్లు ఇక్కడ ఆనవాళ్లు ఉన్నాయి. నేటికి ఇక్కడికి వచ్చే భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన కాశీ లింగాన్ని దర్శించుకున్న తరువాతే శ్రీ రాముడు ప్రతిష్టించిన ఇసుక లింగాన్ని దర్శించుకుంటారు.

ద్వాపరయుగంలో కూడా పాండవులు ఇక్కడ లింగాలను ప్రతిష్టించారు. అరణ్య వాసకాలంలో ఇక్కడకు చేరుకున్న పాండవులు శ్రీరాముడు ప్రతిష్టించిన శివ లింగానికి పూజలు చేసి ధర్మరాజు ధర్మ లింగాన్ని, అర్జునుడు పార్థవ లింగాన్ని, భీముడు భీమ లింగాన్ని ప్రతిష్టించారు. ఆలయం లేక తుంగభద్ర నది ఒడ్డున బహిరంగంగా ఉన్న ఈ శివ లింగాల సమూహాన్ని శ్రీ కృష దేవరాయుల కాలంలో ఆలయ నిర్మాణం జరిగినట్లు ఇక్కడి పూజారి చెపుతున్నారు.

ఇవి కూడా చదవండి

దీంతో ప్రతి ఏటా మహా శివరాత్రి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలను తిలకించడానికి శివ లింగాల దర్శనానికి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తారు. ఇసుక లింగానికి క్షిరాభిషేకం, కల్యాణోత్సవం, మహా రథోత్సవం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది శివరాత్రి కి కూడా అన్ని ఏర్పట్లు చేశారు. తుంగభద్ర నది ఒడ్డున మహిళలకు ప్రత్యేక ఏర్పట్లు వసతులు ఏర్పటు చేశామని అతి వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తాము అని ఆలయ ధర్మకర్త తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ కిల్క్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు