AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parrot Fever: ఐరోపా దేశాలను వణికిస్తోన్న ప్రాణాంతక వైరస్.. ప్యారెట్‌ ఫీవర్‌‌తో ఐదుగురు మృతి..

యూరోపియన్ దేశాలను ప్యారెట్‌ ఫీవర్‌ వణికిస్తోంది. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల సంక్రమించే ఈ శ్వాసకోశ వ్యాధితో అనేక యూరోపియన్‌ దేశాలు కలవరపడుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్వీడన్‌, నెదర్లాండ్స్‌ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Parrot Fever: ఐరోపా దేశాలను వణికిస్తోన్న ప్రాణాంతక వైరస్.. ప్యారెట్‌ ఫీవర్‌‌తో ఐదుగురు మృతి..
Parrot Fever In Europe
Surya Kala
|

Updated on: Mar 08, 2024 | 7:24 AM

Share

మానవాళి మీద వైరస్ లు పగబట్టినట్లు ఉన్నాయి. దాదాపు నాలుగేళ్ళ క్రితం చైనా లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మొదలు.. నేటికీ ప్రపంచంలో ఎక్కడొక చోట రకరకాల వైరస్ లు వ్యాపిస్తూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. జీవితాలను కలవర పెడుతూనే ఉన్నాయి. కరోనా రకరకాల రూపాలను సంతరించుకుని ప్రపంచాన్ని వణికించి.. కనుమరుగు అయింది అని భావిస్తోన్న తరుణంలో బర్ద్ ఫ్లూ, నిఫా వైరస్ అంటూ రకరకాల వైరస్ లు ఎక్కడో చోట కన్పిస్తూ కలవర పెడుతూనే ఉంటాయి. తాజాగా ఐరోపా దేశాలను ప్రాణాంతక వైరస్ వణికిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

యూరోపియన్ దేశాలను ప్యారెట్‌ ఫీవర్‌ వణికిస్తోంది. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ వల్ల సంక్రమించే ఈ శ్వాసకోశ వ్యాధితో అనేక యూరోపియన్‌ దేశాలు కలవరపడుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్వీడన్‌, నెదర్లాండ్స్‌ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వ్యాధి సంక్రమణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.

ప్యారెట్‌ ఫీవర్‌ అంటే ఏమిటంటే

క్లామిడియా పిట్టాసి అనే బ్యాక్టీరియా వల్ల పిట్టకోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. దీన్నే ప్యారెట్‌ ఫీవర్‌గా పిలుస్తారు. పౌల్ట్రీ, అడవి, పెంపుడు పక్షుల వల్ల సంక్రమిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన పక్షుల్లో లక్షణాలు కనిపించనప్పటికీ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. యూరోపియన్‌ దేశాల్లోనే దీని ప్రభావం ఎక్కువ. గత ఐదేళ్లుగా ఆయా దేశాల్లో పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. నమోదిత కేసుల కంటే వాస్తవంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాధి సోకిన పక్షుల స్రావాలతో పాటు వాటి నుంచి వచ్చే ధూళి కణాలను పీల్చడం వల్ల మానవులకు సోకే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..