Viral News: పళ్లు తోమడు, స్నానం చేయడు.. విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కిన భార్య

తన భర్త వ్యక్తగత పరిశుభ్రతని పాటించడు కనుక తనకు తన భర్త నుంచి విడాకులు ఇప్పించండి అంటూ భార్య కేసును దాఖలు చేసినట్లు టర్కీ మీడియా చెప్పింది. ఇదే విషయంపై అంకారాలోని 19వ  ఫ్యామిలీ కోర్టులో ఆ మహిళ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ భర్త కనీసం 5 రోజుల పాటు ఒకే బట్టలు ధరిస్తాడని.. చాలా అరుదుగా స్నానం చేస్తాడని.. దీంతో అతని శరీరం, బట్టల నుంచి చెమట వాసన వస్తూనే ఉంటుంది. ఆ దుర్గంధాన్ని తన క్లయింట్ మాత్రమే కాదు కొలీగ్స్ కూడా  భరించలేక పోతున్నట్లు పేర్కొంది. 

Viral News: పళ్లు తోమడు, స్నానం చేయడు.. విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కిన భార్య
Viral News
Follow us

|

Updated on: Feb 03, 2024 | 2:13 PM

పరిశుభ్రంగా ఉండడం వలన మనమే కాదు.. మనతో ఉండేవారు కూడా ఎటువంటి ఇబ్బంది పడరు. ముఖ్యంగా పొద్దున్న నిద్ర లేచిన వెంటనే పళ్లను శుభ్రంగా తోముకోవడం, స్నానం చేయడం, శుభ్రమైన దుస్తులు ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వేసవిలో ప్రజలు తరచుగా రోజుకు రెండు-మూడు సార్లు స్నానం చేస్తారు. అదే చలి కాలంలో స్నానం చేయాలంటే కొంచెం బద్దకిస్తారు. ఒక్కసారి చెయ్యడమే ఎక్కువ అనుకుంటారు. ఈ సీజన్‌లో కూడా చాలా మంది రోజూ స్నానం చేస్తారు.. అయితే కొంతమంది మాత్రం రెండు మూడు రోజులకు ఒకసారి లేదా వారంలో రెండు సార్లు ఎక్కువ అనుకుంటారు. అప్పుడు అలాంటి వారి పక్కన నిలబడల్లాగా కొంచెం ఇబ్బందినే..  అయితే ఇలా రోజూ స్నానం చేయనందుకు ఎవరైనా కేసు పెడతారని ఊహించారా.. అవును టర్కిలోని ఒక  మహిళ.. తన భర్త చాలా అరుదుగా స్నానం చేస్తాడంటూ కేసు పెట్టింది. తన భర్త స్నానం చేయడం లేదని.. దీంతో విపరీతమైన చెమట వాసన వస్తుంది.. అంతేకాదు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే పళ్ళు తోముకుంటాడని ఆ మహిళ పేర్కొంది.

ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం… తన భర్త వ్యక్తగత పరిశుభ్రతని పాటించడు కనుక తనకు తన భర్త నుంచి విడాకులు ఇప్పించండి అంటూ భార్య కేసును దాఖలు చేసినట్లు టర్కీ మీడియా చెప్పింది. ఇదే విషయంపై అంకారాలోని 19వ  ఫ్యామిలీ కోర్టులో ఆ మహిళ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తన క్లయింట్ భర్త కనీసం 5 రోజుల పాటు ఒకే బట్టలు ధరిస్తాడని.. చాలా అరుదుగా స్నానం చేస్తాడని.. దీంతో అతని శరీరం, బట్టల నుంచి చెమట వాసన వస్తూనే ఉంటుంది. ఆ దుర్గంధాన్ని తన క్లయింట్ మాత్రమే కాదు కొలీగ్స్ కూడా  భరించలేక పోతున్నట్లు పేర్కొంది.

పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశం..

నివేదికల ప్రకారం తన భర్తకు వ్యతిరేకంగా భార్య చేసిన వాదనలను ధృవీకరించడానికి కొంతమంది సాక్షులను కూడా కోర్టులో హాజరుపరిచారు. ఇందులో ఆ భర్తతో పాటు ఆమెతో పనిచేస్తున్న కొంతమంది సహోద్యోగులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఆమె భర్త శుభ్రంగా ఉండడని.. రోజూ చెమట కంపు కొట్టుకుంటూ ఆఫీసుకు వస్తాడని.. సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత కోర్టు మహిళకు భర్త నుండి విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు భార్యకు 16,500 డాలర్లు పరిహారంగా అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 13 లక్షల 69 వేలు పరిహారం చెల్లించమని భర్తకు ఆదేశాలు జారే చేసింది.

ఇవి కూడా చదవండి

వారానికి 1-2 సార్లు బ్రష్

కోర్టులో సాక్షుల వాంగ్మూలం ప్రకారం ఆ మహిళ భర్త ప్రతి  10 రోజులకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తాడు. అంతేకాదు వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే పళ్ళు తోముకుంటాడు. దీంతో నోటి దుర్వాసన, శరీర దుర్వాసన వస్తూ ఉండడంతో ఆ భర్తతో భార్య జీవించడం కష్టముగా మారింది. మహిళ తరఫు న్యాయవాది టర్కీ వార్తాపత్రికతో మాట్లాడుతూ ‘భార్యాభర్తలు కలిసి జీవితానికి సంబంధించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. భాగస్వామ్య ప్రవర్తన కారణంగా వారిని భరించలేని విధంగా మారితే.. విడాకుల కోసం దావా వేసే హక్కు ఇరువురికి ఉంటుంది. మానవ సంబంధాల విషయంలో మనమందరం జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, పరిశుభ్రత రెండింటిపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్..
మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్..
IND vs SA: కోహ్లీ, రోహిత్‌‌ల హిస్టరీకి చెక్ పెట్టనున్న సూర్య
IND vs SA: కోహ్లీ, రోహిత్‌‌ల హిస్టరీకి చెక్ పెట్టనున్న సూర్య
అరటిపండుతో అందం.. ఇలా వాడితే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం..!
అరటిపండుతో అందం.. ఇలా వాడితే మీ ముఖం మెరిసిపోవడం ఖాయం..!
కిలో గోధుమ పిండి రూ.30, బియ్యం 34కే.. మళ్లీ భారత్‌ బ్రాండ్‌!
కిలో గోధుమ పిండి రూ.30, బియ్యం 34కే.. మళ్లీ భారత్‌ బ్రాండ్‌!
వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే రూ.50 లక్షలు హాంఫట్..!
వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే రూ.50 లక్షలు హాంఫట్..!
రాహుల్‌ ఇక్కడకు వచ్చేయండి.. బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం..
రాహుల్‌ ఇక్కడకు వచ్చేయండి.. బిర్యానీ తింటూ మాట్లాడుకుందాం..
సాయంత్రం కాగానే భయంగా ఉంటుందా.? ఈ సమస్యతో బాధపడుతున్నట్లే
సాయంత్రం కాగానే భయంగా ఉంటుందా.? ఈ సమస్యతో బాధపడుతున్నట్లే
గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ వేదికగా 3 రోజుల సదస్సు
గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ వేదికగా 3 రోజుల సదస్సు
నవశకానికి నాంది.. కొత్త ప్రపంచా‎లతో యంగ్ డైరెక్టర్స్‌ మ్యాజిక్..
నవశకానికి నాంది.. కొత్త ప్రపంచా‎లతో యంగ్ డైరెక్టర్స్‌ మ్యాజిక్..
అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది.. ఊహించని ట్విస్ట్
అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చేసింది.. ఊహించని ట్విస్ట్
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే