జ్ఞానవాపి మసీదు కింద తవ్వకాల్లో బయటపడ్డ విష్ణువు, హనుమంతుని విగ్రహాలు

జ్ఞానవాపి మసీదు కింద తవ్వకాల్లో బయటపడ్డ విష్ణువు, హనుమంతుని విగ్రహాలు

Phani CH

|

Updated on: Feb 03, 2024 | 2:02 PM

వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్టు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో భారత పురావస్తుశాఖ ASI ఇటీవల వెల్లడించింది. వాటిలో విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. మసీదు ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుమతితో ASI తవ్వకాలు జరిపింది.

వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదు కింద ఇటీవల జరిపిన తవ్వకాల్లో కొన్ని హిందూ దేవతల విగ్రహాలు బయటపడినట్టు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో భారత పురావస్తుశాఖ ASI ఇటీవల వెల్లడించింది. వాటిలో విష్ణువు, హనుమంతుడి విగ్రహాలు కూడా ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. మసీదు ఉన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు శివాలయం ఉండేదన్న వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు అనుమతితో ASI తవ్వకాలు జరిపింది. తవ్వకాల్లో బయటపడిన కళాఖండాల్లో విష్ణుమూర్తి, హనుమంతుడి విగ్రహాలు బయటపడడం అక్కడ అభివృద్ధి చెందిన సంస్కృతుల సమ్మేళనానికి నిదర్శనమని చెబుతున్నారు. తవ్వకాల్లో బయటపడిన ఈ విగ్రహాలలో సగం విరిగిపోయిన హనుమంతుడి విగ్రహం కూడా ఉంది. ఇందులో హనుమంతుడు గధ ధరించి ఉన్న పై భాగం ఒక శిలపై ఉంది, మరో శిలపై కింది సగభాగం కాళ్లు ఓ రాతిపై ఉన్నాయి. ఇది ఆంజనేయుడి ఐకానిక్ భంగిమ అని చెబుతున్నారు. మరో విగ్రహం మధ్యయుగ ప్రారంభం కాలం నాటిదని, ఇందులో సగం మనిషి, సగం సర్పం కలిగి ఉంది. ఈ విగ్రహం విష్ణుమూర్తి వరాహావతారాన్ని సూచిస్తోందని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉద్యోగుల్ని తీసేసి.. ఆదాయం పెంచుకున్న గూగుల్

మనిషి బ్రెయిన్లో మస్క్ చిప్.. అసలు ఎలా పని చేస్తుంది ??

ఆమె హోటల్‌ బిల్లు రూ.6 లక్షలు.. అకౌంట్‌లో కేవలం రూ.41లు.. చివరికి ??

అయోధ్య రాముడి దర్శనానికి వెళుతున్నారా ?? మీకో బంపరాఫర్‌

Mahesh Babu: సినిమా పక్కకు పెడితే.. మహేష్ జాకెట్‌ రేటే అన్ని లక్షలా..