Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ujjain: యమ చిత్రుగుప్తుల గుడి.. మోక్షం కోరుతూ దీపం వెలిగించే ప్రపంచంలో ఏకైక ఆలయం

రోగాల నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ధర్మరాజ దేవాలయం వేలాది మందికి విశ్వాస కేంద్రంగా ఉంది. రోజూ వేలాది మంది దర్శనం కోసం వస్తుంటారు. అంతే కాదు ఈ గుడిలో దీపం వెలిగించడం కూడా ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల అకాల మృత్యు భయం నుంచి విముక్తి లభిస్తుందని కూడా చెబుతారు. శారీరక సమస్యలతో జీవన్మరణాల మధ్య పోరాడుతున్న వారి రక్షణ లేదా మోక్షం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.

Ujjain: యమ చిత్రుగుప్తుల గుడి.. మోక్షం కోరుతూ దీపం వెలిగించే ప్రపంచంలో ఏకైక ఆలయం
Dharmraj Chitragupta Templ
Follow us
Surya Kala

|

Updated on: Feb 03, 2024 | 1:29 PM

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లయకారుడైన శివయ్య కొలువైన క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మహా కాళేశ్వర ఆలయంతో పాటు అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒకొక్క ఆలయం ఒకొక్క ప్రత్యేకతను కల్గి ఉండి  భక్తులతో పూజలను అందుకుంటాయి. మంచి జీవితం కోసం, ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి, ఆరోగ్యం కోసం, ఇలా కోరిన కోరికలు తీరడానికి తరచుగా భక్తులు ఆలయానికి వెళతారు. అయితే ఉజ్జయినిలో ఒక దేవాలయానికి మాత్రం మోక్షం ప్రసాదించమంటూ కోరుకోవడానికి వెళ్లారు. అంతే కాదు ఈ ఆలయంలో చేసిన ప్రార్ధన, కోర్కెలు కొన్ని గంటల్లోనే నెరవేరుతాయని కూడా చెబుతారు. ఈ ఆలయ పౌరాణిక చరిత్ర గురించి తెలుసుకుందాం.

ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే..

ఈ ఆలయం షిప్రా నది ఒడ్డున ఉన్న రామ్‌ఘాట్ వద్ద నిర్మించబడింది. ఈ ఆలయంలో యమ ధర్మ రాజు,  ధర్మ రాజు, చిత్రగుప్తుడులు ఉంటారూ. ప్రపంచంలో ఈ ముగ్గురు కొలువైన ఏకైక దేవాలయం ఇదేనని చెబుతారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల పాపాలు నశించి, కాలసర్ప దోషాల నుండి విముక్తి లభిస్తుంది. బాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ ధర్మరాజ చిత్రగుప్త దేవాలయం స్కంద పురాణం, అగ్ని పురాణాలలో కూడా ప్రస్తావించబడింది. ఆలయ పూజారి రాకేష్ జోషి మాట్లాడుతూ..  యముడు, ధర్మరాజు, చిత్రగుప్తుడు, యముడు సోదరి యమునా దేవి ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి దర్శనం కోసం వచ్చిన వారికి కష్టాలు, పాపాలు, దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ఈ ఆలయం కాల దోషాన్ని నివారణ పూజలకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

వందల ఏళ్ల నాటి చరిత్ర

కర్కాటక రాశి ఈ ఆలయం మీదుగా వెళుతుందని అందుకే ఈ ప్రదేశానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెప్పారు. గత 400 ఏళ్లుగా తమ పూర్వీకులు కూడా ఈ ఆలయంలో పూజలు చేస్తున్నారని తెలిపారు. రోగాల నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ధర్మరాజ దేవాలయం వేలాది మందికి విశ్వాస కేంద్రంగా ఉంది. రోజూ వేలాది మంది దర్శనం కోసం వస్తుంటారు. అంతే కాదు ఈ గుడిలో దీపం వెలిగించడం కూడా ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల అకాల మృత్యు భయం నుంచి విముక్తి లభిస్తుందని కూడా చెబుతారు.

శారీరక సమస్యలతో జీవన్మరణాల మధ్య పోరాడుతున్న వారి రక్షణ లేదా మోక్షం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయంలో పూజలు చేసిన 48 గంటల్లో ఫలితం కనిపిస్తుంది. ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

మోక్షం కోరుతూ దీపం

ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతూ జీవితంతో పోరాడుతున్న వారు ఈ ఆలయానికి దర్శనం కోసం వచ్చి రక్షణ లేదా మోక్షాన్ని కోరుతూ ఇక్కడ పూజలు చేస్తారని చెబుతారు. ఈ ఆలయంలో పూజలు చేసిన కొద్ది గంటల్లోనే ఫలితం లభిస్తుందని నమ్మకం. ఎవరికైనా ఏదైనా నయం కాని వ్యాధి ఉంటే.. ఆ వ్యక్తి ఈ ఆలయానికి వచ్చి  మోక్షం కోరుతూ నెయ్యి దీపం వెలిగిస్తే, కొంత కాలానికి మోక్షం లభిస్తుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు