Telangana: రాజన్న, అంజన్న దర్శనం కోసం పోటెత్తుతున్న భక్తులు.. అరకొర సౌకర్యాలతో ఇక్కట్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో.. భక్తుల రద్దీ పెరిగింది. అదే విధంగా కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నెల చివరి వారంలో మేడారం జాతర ఉంది. దీంతో ఈ జాతర కంటే ముందే ఈ రెండు ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీ.. ఇప్పుడు ఈ రెండు ఆలయాల్లోగత 15 రోజుల నుంచి ప్రతి రోజు.. 40 వేయిలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు
మేడారం కంటే ముందు… రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రలైన వేములవాడ, కొండగట్టు ఆలయాలకు.. భక్తులు పోటెత్తుతున్నారు. ఎటూ చూసినా భక్త జనం కనబడుతుంది.. గత 15 రోజుల నుంచీ.. భక్తుల రద్దీ పెరుగుతుంది. మేడారం జాతర కంటే ముందు.. ఈ రెండు ఆలయాలను.. దర్శించుకోవడం ఆనవాయితీ. అక్కడ మొక్కులు చెల్లించుకున్న తరువాత మేడారం వెళ్తారు.ఈ నేపథ్యంలో ఈ రెండు ఆలయాలు భక్తుల రద్దీతో నిండి ఉంటుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో.. భక్తుల రద్దీ పెరిగింది. అదే విధంగా కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరుతున్నారు. ఈ నెల చివరి వారంలో మేడారం జాతర ఉంది. దీంతో ఈ జాతర కంటే ముందే ఈ రెండు ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీ.. ఇప్పుడు ఈ రెండు ఆలయాల్లోగత 15 రోజుల నుంచి ప్రతి రోజు.. 40 వేయిలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వేములవాడ దర్శనం తరువాత… కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. వేములవాడలో.. ఒక్క రోజు నిద్ర చేసి.. తరువాత. కొండగట్టుకు వెళ్తున్నారు. భక్తుల రద్దీ పెరిగిపోతుంది..
ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కోడెను మొక్కగా చెల్లించుకుంటున్నారు.. అయితే… సరైన సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నారు… ఆరు బయటనే నిద్రించే పరిస్థితి నెలకొంది.. ఇప్పటికే.. ఈ రెండు ఆలయాల్లోనూ ఆర్జీత సేవలను నిలిపివేశారు.. వేములవాడలో…. స్వామి దర్శనానికి నాలుగు నుంచీ 5 గంటల సమయం పడుతుంది. అదే విధంగా… కొండుగట్టులో మూడు నుంచీ నాలుగు గంటల సమయం పడుతుంది.. అనుబంధ ఆలయాల్లో…. భక్తుల రద్దీ కూడా పెరిగింది.. కొంత మంది భక్తులు.. ఇక్కడే.. బెల్లాన్ని మొక్కుగా చెల్లిస్తున్నారు. ఇక్కడ దర్శనమైన తరువాత… వేములవాడ జాతరకు వెళ్తారు.. మరో 15 రోజుల పాటు.. ఇదే విధంగా భక్తుల తాకిడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
సహజంగా శివరాత్రి సమయంలో వేములవాడలో రాజన్నని భక్తులు ఎక్కువగా దర్శనం చేసుకుంటారు. కానీ.. ఇప్పుడు శివరాత్రి కంటే.. ఎక్కువగా భక్తులు వస్తున్నారు. అదే ధంగా… కొండగట్టుకు.. హనుమన్ జయంతి సందర్భంగా భక్తుల తాడికి ఎక్కువగా ఉంటుంది.. ఇప్పుడు అంతకంటే.. ఎక్కువగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు.. ఈ రెండు ఆలయాల పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనబడుతుంది.. శని, ఆదివారాల్లో… ఇంకా భక్తుల తాకిడి పెరుగుతుంది.. వసతి సౌకర్యాలు లేకపోవడంతో.. చాలా మంది భక్తులు.. స్వా వారిని దర్శించుకొని.. తిరిగి వెళ్తున్నారు.. కొండగట్టులో కూడా ఇదే పరిస్థితిని భక్తులు ఎదుర్కొంటున్నారు.. మొత్తానికి.. ఈ రెండు ఆలయాలు భక్తులతో సందడిగా మారిపోయాయి.. సమ్మక్క, సారక్క జాతర కంటే ముందు.. వేములవాడతో పాటు కొండగట్టు ఆలయాన్ని దర్శించుకుంటామని భక్తులు చెబుతున్నారు. దర్శానికి చాలా ఇబ్బందులు ఎదురువుతన్నాయని అంటున్నారు… గంటల తరబడి… స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..