Telangana: నిషా కోసం యువత కొత్త దారులు.. మత్చునిచ్చే టాబ్లెట్స్, ఇంజక్షన్ల వినియోగం.. ముగ్గురు అరెస్ట్..
రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం మోపుతోంది. దీంతో మత్తుకు బానిసైన యువత కొత్త తరహాలో మత్తుకు చిత్తు అవుతున్నారు. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అడ్డదారుల్లో అమ్ముతున్నారు.
మత్తుకు బానిసైన యువత గంజాయి, వైట్ నర్ ను పీల్చి ఎంజాయ్ చేసేవారు. గంజాయితో తీసిన హాష్ ఆయిల్ ను కూడా పీల్చేవారు. నొప్పి నివారణ, మానసిక రుగ్మతులకు వినియోగించే టాబ్లెట్లను వినియోగించి మత్తు అనుభూతిని పొందేవారు. గంజాయి, ఇతర డ్రగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెతుకుతోంది. దీంతో మత్చునిచ్చే టాబ్లెట్స్, ఇంజక్షన్లను సరికొత్తగా వినియోగిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహిత తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కు పాదం మోపుతోంది. దీంతో మత్తుకు బానిసైన యువత కొత్త తరహాలో మత్తుకు చిత్తు అవుతున్నారు. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అడ్డదారుల్లో అమ్ముతున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్, అల్ట్రా కింగ్ , ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు కలిగివున్న ముగ్గురు వ్యక్తులను నల్గొండ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
నల్లగొండకు చెందిన జబీయుల్లా, ఎండీ సల్మాన్ లు మత్తుకు బానిసలయ్యారు. వైట్ నర్, గంజాయిని పీల్చేవారు. గంజాయి దొరకడం కష్టంగా మారడంతో కొత్త తరహాకు ప్లాన్ చేశారు. నొప్పి నివారణ, మానసిక రుగ్మతలకు వినియోగించే టాబ్లెట్స్, ఇంజెక్షన్లను మత్తు కోసం తీసుకుంటున్నారు. శివాజీ నగర్ లోని న్యూ హెల్త్ కేర్ ఫార్మసీకి చెందిన తౌడోజు నరేష్ నుండి ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్, ఇంజెక్షన్‌లను కొనుగోలు చేసేవారు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఈ టాబ్లెట్స్, ఇంజక్షన్లను సిగరెట్ పెట్టెల్లో పెట్టి బయట వ్యక్తులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
ఈ మాత్రలు , ఇంజక్షన్‌లు అలవాటుగా మారినట్లు.. గత మూడేళ్లుగా ఎక్కువ మోతాదులో సేవిస్తున్నామని చెప్పారు. ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు వీరి నుండి 4032 స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్ టాబ్లెట్స్, 585 అల్ట్రా కింగ్ టాబ్లెట్స్, 300 ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ యజమానులు మత్తు కలిగించే టాబ్లెట్స్, ఇంజెక్షన్‌లు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటూ పి.డి యక్ట్స్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. మాదకద్రవ్యాల సమాచారం ఇచ్చే వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..