AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: మీ జీవితంలో ఈ ఘటనలు ఎదురైతే శనీశ్వరుడు వక్ర దృష్టితో ఉన్నట్లేనట..

హిందూ మతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ కారణంగా, పురాతన కాలం నుండి శనివారం శశనీశ్వరుడిని పూజిస్తున్నారు. ఏలి నాటి శని అంటే చాలు ఎవరైనా సరే భయపడతారు. అయితే శని దేవుడు దుష్టులను శిక్షించినట్లే.. నిజాయితీపరులకు సంపద, పదవి, గౌరవాన్ని ఇస్తాడు. నీశ్వరుడు విశ్వంలోని ప్రతి జీవి జీవితాన్ని అతను చేసే పనుల ప్రకారం నిర్ణయిస్తాడు

Lord Shani: మీ జీవితంలో ఈ ఘటనలు ఎదురైతే శనీశ్వరుడు వక్ర దృష్టితో ఉన్నట్లేనట..
Shani Dev
Surya Kala
|

Updated on: Feb 03, 2024 | 9:07 AM

Share

శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా భావిస్తారు. సమస్త జగత్తులోని సమస్త జీవరాశులకు వారి వారి కర్మలను బట్టి ఫలాలను అందజేస్తాడు. తొమ్మిది గ్రహాల్లో శనీశ్వరుడు అత్యంత క్రూరమైన, హింసాత్మకమైన వాడుగా  పరిగణించబడుతున్నాడు. హిందూ మతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఈ కారణంగా, పురాతన కాలం నుండి శనివారం శశనీశ్వరుడిని పూజిస్తున్నారు. ఏలి నాటి శని అంటే చాలు ఎవరైనా సరే భయపడతారు. అయితే శని దేవుడు దుష్టులను శిక్షించినట్లే.. నిజాయితీపరులకు సంపద, పదవి, గౌరవాన్ని ఇస్తాడు.

శనీశ్వరుడు విశ్వంలోని ప్రతి జీవి జీవితాన్ని అతను చేసే పనుల ప్రకారం నిర్ణయిస్తాడు. శని అనుగ్రహం వల్ల జీవితంలో కీర్తి, సంపద, ఆస్తి, మోక్షం లభిస్తాయి. శనిదేవుడు కోపంగా ఉంటే ఆ వ్యక్తి తన జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు. శనీశ్వరుడు వక్ర దృష్టిలో చూస్తున్నాడు అన్న విషయాన్నీ కొన్ని సంఘటనల ద్వారా గుర్తించవచ్చు.

శనీశ్వరుడు వక్ర దృష్టితో ఉన్నాడని ఎలా గుర్తించవచ్చంటే..

ఇవి కూడా చదవండి

చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఏర్పడితే:  జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి కలుగుతుంటే ఆ వ్యక్తి  తెలివితేటలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నా శనీశ్వరుడు వక్ర దృష్టితో ఉన్నాడని అర్ధం అంతేకాదు మనిషికి మంచి విషయాలు కనిపించవు. చెడ్డ విషయాలను మాత్రమే చూడగలడు. వ్యక్తుల పూర్వపు కర్మల ఆధారంగా, వారి తెలివితేటలపై ప్రభావాన్ని చూపించి పనిలో ముందుకు వెళ్లే మార్గం కనిపించని విధంగా ఉంచుతాడు. ప్రతిచోటా ఓటమినే ఎదుర్కొంటాడు. ముందుకు వెళ్ళడానికి వీలుపడదు.

అప్పులు పెరగడం: శనీశ్వరుడు ఎవరిపై కోపంగా ఉంటాడో అలాంటి వ్యక్తులు అప్పుల భారం విపరీతంగా పెరిగిపోతుంది. అవసరం లేకపోయినా అప్పులు చేసి అనవసరమైన వస్తువులు కొని వృధా చేస్తారు. దీంతో ఆ వ్యక్తిపై అప్పుల భారం బాగా పెరిగి ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతుంటాడు. జీవితంలో ఎవరికీ సహాయం చేయని వ్యక్తికి అలాంటి శిక్ష పడుతుంది. ఎల్లప్పుడూ అర్ధవంతమైన పని చేయని వ్యక్తి జీవితంలో అలాంటి స్థితిని తెస్తాడు శనీశ్వరుడు.

వ్యసనాలకు అలవాటు అవ్వడం: ఎవరినైనా వ్యసనాలు చుట్టుముట్టినట్లయితే.. మత్తుపదార్థాలను ఉపయోగించడం ప్రారంభించినట్లయినా లేదా అకస్మాత్తుగా ఏదైనా చెడు అలవాటును అలవర్చుకుంటే, అది అతని కర్మల ఫలితం. ఎవరినైనా బాధపెడితే, అతని తల్లిదండ్రులను దుర్భాషలాడితే ఆ వక్తులకు శనీశ్వరుడు  ఇలాంటి శిక్షను ఇస్తాడు. శని చెడు దృష్టితో చెడు అలవాట్లను అలవర్చుకుంటే అతను వాటి నుంచి బయటపడటం చాలా కష్టం.

తీవ్రమైన రోగాల బారిన పడడం: ఇతరుల డబ్బుని తమ హక్కుగా వాడుకునే వ్యక్తులు, ఇతరులను మోసం చేయడం ద్వారా డబ్బు సంపాదించే వ్యక్తులు తీవ్రమైన వ్యాధుల బారిన పడతారు. ఇతరులను డబ్బులను స్వాధీనం చేసుకుని అలా డబ్బు సంపాదించే వ్యక్తిని శనీశ్వరుడు క్షమించడు.

ప్రత్యేక రోజులలో పని చెడిపోతుంది:  శని దేవుడికి కోపం వచ్చినప్పుడు పని చెడిపోవడం ప్రారంభమవుతుంది. అయితే కొన్నిసార్లు మీ పని ప్రత్యేకమైన రోజున మాత్రమే చెడిపోతుంది. ఉదాహరణకు, శనివారం మీరు చేపట్టిన పనిలో కొన్ని అడ్డంకులు కలుగుతుంటే అది శనీశ్వరుడు అసంతృప్తికి కారణం కావచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు