Weekly Horoscope: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..

వార ఫలాలు (ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Weekly Horoscope: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.. 12 రాశుల వారికి వారఫలాలు ఇలా..
Weekly Horoscope 04 Feb 10 Feb 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 04, 2024 | 5:01 AM

వార ఫలాలు (ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 10, 2024 వరకు): మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడచిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి, నిరుద్యోగు లకు అవకాశాలు అందివస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉండవచ్చు. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు కొంత వరకూ సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అప్పుడప్పుడూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ఇబ్బంది పడడం జరుగుతుంది. విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఒకటి రెండు శుభ గ్రహాల అనుకూలత వల్ల వారమంతా మిశ్రమ ఫలితాలలో గడిచిపోయే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడం మంచిది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందర పాటుతనంతో మాట్లాడవద్దు. ఉద్యోగం మారడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. వృత్తి, వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినే సూచనలున్నాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాదిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొత్త పుంతలు తొక్కుతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. అయితే, అధికారులతో ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు ముందుకు దూసుకు వెలతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, సామరస్యంగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శుక్ర, బుధ, రవి గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితికి మాత్రం లోటుండదు. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బకాయిలు, బాకీలు చేతికి అందుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతం అవుతుంది. ఎంతో సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. సర్వత్రా మాట చెల్లుబాటవుతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఒత్తిడికి గురవుతారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. శుభకార్యాల మీద బాగా వ్యయం అవుతుంది. ఒకరిద్దరికి సహాయం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా కొనసాగుతాయి. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. విద్యార్థులు తక్కువ శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలకు విలాసాలు జోడవుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఒక్క శని తప్ప మిగిలిన గ్రహాలేవీ పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల ఇంటా బయటా కొన్ని ఇబ్బందులు, వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండే అవ కాశం ఉంది. అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారం కలిసి వస్తుంది. ఐ.టి నిపుణులకు ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఆదాయం లేదా సంపాద నలో మెరుగుదల కనిపిస్తోంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత పడాల్సి ఉంటుంది. తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గురు, బుధ, శుక్రుల సంచారం బాగా అనుకూలంగా సాగుతున్నందువల్ల ఏ పని తలపెట్టినా సఫలం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, దానితో పోటీగా ఖర్చులు కూడా పెరుగుతాయి. శుభ కార్యాల మీదా లేదా దైవ కార్యాల మీదా బాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవాభి మానాలకు లోటుండదు. ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపా రాల్లో లాభాలు గడించడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు. విద్యార్థులు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

ఒక్క శనీశ్వరుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ చాలావరకు అనుకూల ఫలితాలనిస్తాయి. శుక్ర బలం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలపై శ్రద్ధ పెంచడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు రొటీనుగా సాగిపోతాయి. ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు. జీవిత భాగస్వామికి బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీనుగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువు పంచమంలో అనుకూలంగా ఉండడం, పైగా కుజుడితో పరివర్తన చెందడం వల్ల కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా సానుకూల సమాచారం అందే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి రావడం జరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ముఖ్య మైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ధనాధిపతి శని బలం వల్ల ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. తెలివితేటలతో కొన్ని సమస్య లను పరిష్కరించుకుంటారు. ఇతర శుభ గ్రహాలు కూడా ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాయి. అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ, కుటుంబ విషయాలు ఉత్సాహం కలిగిస్తాయి.ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితికి చేరుకుం టారు. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఏలిన్నాటి శని కూడా అనుకూల ఫలితాలనిస్తుంది. వారమంతా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగు తాయి. కుటుంబ వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. పిల్లల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ పెద్దలలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది. వాహన ప్రమాదా లతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ప్రేమ వ్యవహారాల్లో రొటీనుగా సాగిపోతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశివారికి గురు బలంతో పాటు, బుధ, శుక్ర, రవులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యక్తిగతంగానూ, కుటుంబపరంగానూ శుభ వార్తలు వినడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. సల హాలు, సూచనలకు విలువ ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారం ప్రారం భించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.