Foreign Trip: ఆ రాశుల వారికి విదేశీయాన యోగం.. మీ రాశికి ఎలా ఉందంటే..?
విదేశీ యానానికి బాగా అనుకూలమైన రాశి అయిన ధనూ రాశి నుంచి మేష రాశి వరకు గ్రహాలన్నీ వరుస కట్టినందువల్ల ఆరు రాశుల వారికి విదేశీయోగం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ విదేశీయాన యోగం పట్టడానికి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడం, ఇతర దేశాల్లో వృత్తి, ఉద్యోగాలు లభించడం, విదేశీ సొమ్ము తినడం..
విదేశీ యానానికి బాగా అనుకూలమైన రాశి అయిన ధనూ రాశి నుంచి మేష రాశి వరకు గ్రహాలన్నీ వరుస కట్టినందువల్ల ఆరు రాశుల వారికి విదేశీయోగం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ విదేశీయాన యోగం పట్టడానికి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడం, ఇతర దేశాల్లో వృత్తి, ఉద్యోగాలు లభించడం, విదేశీ సొమ్ము తినడం, విదేశాల్లో స్థిరపడడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. మేషం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశులకు ఈ యోగం పట్టే సూచనలున్నాయి.
- మేషం: ఈ రాశ్యధిపతి అయిన కుజుడు ప్రస్తుతం భాగ్య (విదేశీ)స్థానంలో కొనసాగుతుండడం, ఈ నెల 6 నుంచి తన ఉచ్ఛ స్థానంలో సంచారం ప్రారంభించడం వంటి కారణాల వల్ల ఈ రాశివారికి విదేశాల్లో ఉద్యోగం సంపాదించే యోగం ఉంది. ఇప్పటికే అక్కడ వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిరపడే అవ కాశం ఉంది. మొత్తం మీద ఆ రాశివారు చదువులు, ఉద్యోగాల విషయంలో ఎటువంటి ఆటం కమూ లేకుండా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశీ పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉన్న రాహువు తప్పకుండా విదేశీ యోగం కలిగించే అవకాశం ఉంది. పైగా భాగ్య స్థానాధిపతి గురువు ఉద్యోగ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగపరంగా కోరుకున్న దేశానికి వెళ్లడం జరుగుతుంది. వీరికి అతి త్వరలో విదేశీ సొమ్ము తినే అవకాశం ఉంది. వీసా సమస్యలు ఏవైనా ఉంటే అవి సునాయాసంగా పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి ఆశించిన ఆఫర్లు అందే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా అవకాశాలు వస్తాయి.
- కన్య: ఈ రాశివారికి భాగ్యాధిపతి శుక్రుడు బాగా అనుకూలంగా ఉండడం, ఉద్యోగాలకు కారకుడైన శనీశ్వరుడు స్వక్షేత్రంలో ఉండడం వంటి కారణాల వల్ల తప్పకుండా విదేశీయాన యోగం పట్టే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం వల్ల వీరు అతి తక్కువ కాలంలో సత్ఫ లితాలు పొందుతారు. చదువులు లేదా పెళ్లి విషయంలో కూడా ఈ రాశివారు ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. చిన్నపాటి ప్రయత్నంతో వీరి విదేశీ యాన కలలు తప్పకుండా నెరవేరుతాయి.
- తుల: ఈ రాశివారికి ఒక్క భాగ్యాధిపతే కాకుండా శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల విదేశీ అవకాశాలు అంది వచ్చే సూచనలున్నాయి. కోరుకున్న దేశంలో ఆశించిన ఉద్యోగం లభించడా నికి అవకాశం ఉంది. విదేశీ యానానికి సంబంధించి ఎటువంటి సమస్యలు, ఆటంకాలున్నా తొలగిపోతాయి. ఇప్పటికే అక్కడ వృత్తి, ఉద్యోగాలలో ఉన్నవారికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నవారి జీతభత్యాలు పెరగడం కూడా జరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశివారికి శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడంతో పాటు రాశ్యధిపతి గురువుతో కుజ గ్రహానికి పరివర్తన కూడా ఏర్పడినందువల్ల విదేశీ యానానికి, విదేశాల్లో ఉద్యోగానికి ఏ చిన్న ప్రయత్నం చేసినా విజయం సాధించడం జరుగుతుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏదో ఒక కారణం మీద ఈ రాశివారు త్వరలో విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- మీనం: ఈ రాశివారికి విదేశాలకు వెళ్లాలన్నకోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఈ రాశ్యధిపతి గురువు చర రాశిలో ఉండి ఉద్యోగ స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల విదేశాల్లో ఉద్యోగానికి సంబంధించిన వీరి కలలు చిన్న ప్రయత్నంతో నెరవేరే అవకాశం ఉంది. వీరికి విదేశీ ధనం తినే యోగం ఉంది. విదేశాలతో ముడిపడి ఉన్న ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అతి తక్కువ కాలంలో విజయం సాధి స్తాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్న వారికి కూడా అతి త్వరలో మహా భాగ్య యోగం పడుతుంది.