NTR District: ఆ గ్రామంలో కోతుల బెడద.. ఇళ్ల ముందు కర్రలతో మహిళల గస్తీ.. ఓట్లు కావాలంటే ప్రాబ్లెమ్ తీర్చాలంటూ డిమాండ్

షేర్ మహమ్మద్ పేట రోడ్డు పై గ్రామస్థులు బైఠాయించి రాస్తారోకో చేశారు. గ్రామ సచివాలయం ముందు ధర్నా కూడా చేసారు. ఇళ్లల్లోకి , రోడ్డు పై వెళ్తున్న వారిని కరుస్తూ స్థానికులను ఇబ్బంది పెడుతున్న కోతుల్ని వెంటనే పట్టుకొని అడవుల్లో వదలాలన్నది వీరి డిమాండ్‌. ఇళ్ల ముందు కర్రలతో మహిళలు గస్తీ తిరుగుతున్నారు. కొద్ది రోజులుగా కోతులు తమను పీడిస్తున్నాయని, ఇంటికి ఎప్పుడూ తలుపులు వేసే ఉంచాలని, వానరాలు ఏ పనీ చెయ్యనివ్వడం లేదని వాపోయారు.

NTR District: ఆ గ్రామంలో కోతుల బెడద.. ఇళ్ల ముందు కర్రలతో మహిళల గస్తీ.. ఓట్లు కావాలంటే ప్రాబ్లెమ్ తీర్చాలంటూ డిమాండ్
Monkeys Halchal
Follow us
Surya Kala

|

Updated on: Feb 03, 2024 | 6:49 AM

ఒక్క కోతి వనం వీడి.. జనంలోకి వస్తేనే దాని చేష్టలకు .. జనం పడే పాట్లుకు అంతే ఉండదు. మరి అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా భర్తీ సంఖ్యలో కోతులు వనం వీడితే.. జనంలోకి వస్తే అప్పుడు అక్కడ ఏర్పడే పరిస్థితుల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. ఆ గ్రామంలో కోతులు సెటిలై.. కాయలు, పండ్లే కాదు, మనుషుల్లాగే వెరైటీ తిండి తింటున్నాయి. గ్రామస్థులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. అవును గడిచిన దశాబ్దం నుంచి కోతుల జనాభా అంతకంతా పెరుగుతుంది. కోతుల సంఖ్య ఎంతగా పెరిగిందంటే అవి మనుషుల మధ్య దర్జాగా బతుకుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట లో కోతుల బెడద నుంచి రక్షించండి అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. షేర్ మహమ్మద్ పేట రోడ్డు పై గ్రామస్థులు బైఠాయించి రాస్తారోకో చేశారు. గ్రామ సచివాలయం ముందు ధర్నా కూడా చేసారు. ఇళ్లల్లోకి , రోడ్డు పై వెళ్తున్న వారిని కరుస్తూ స్థానికులను ఇబ్బంది పెడుతున్న కోతుల్ని వెంటనే పట్టుకొని అడవుల్లో వదలాలన్నది వీరి డిమాండ్‌.

ఇళ్ల ముందు కర్రలతో మహిళలు గస్తీ తిరుగుతున్నారు. కొద్ది రోజులుగా కోతులు తమను పీడిస్తున్నాయని, ఇంటికి ఎప్పుడూ తలుపులు వేసే ఉంచాలని, వానరాలు ఏ పనీ చెయ్యనివ్వడం లేదని వాపోయారు. కోతుల దాడి తో గాయల పాలై ఆసుపత్రి చుట్టూ కొందరు తిరుగుతున్నారనీ కోతులు ఎక్కడ కరుస్తాయో అన్న భయం తో పరిగెత్తి కింద పడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని ఇంకొందరు ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. కోతుల సమస్య తీర్చకుండా ఈ సారి ఓట్ల కోసం వస్తే ఒక్క ఓటు కూడా వెయ్యమని గట్టి వార్నింగ్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే