Mahabharata: ఇంట్లో మహాభారత పారాయణం అశుభమా.. ? వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసా..!

హిందూ మత విశ్వాసాల ప్రకారం రామాయణం, భగద్గీత మొదలైన గ్రంధాలను ఇంట్లో ఉంచడం..  పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహా భారతాన్ని ఇంట్లో ఉంచడం లేదా చదవడం వల్ల ఇంట్లో అశుభం, ప్రతికూలతలు ఏర్పడతాయని విశ్వాసం. కుటుంబ సభ్యుల మధ్య వాదనలు వంటి సంఘటనలు పెరుగుతాయని ఒక నమ్మకం.

Mahabharata: ఇంట్లో మహాభారత పారాయణం అశుభమా.. ? వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసా..!
Mahabharat
Follow us

|

Updated on: Feb 03, 2024 | 7:54 AM

హిందూమతంలో మహాభారతాన్ని పంచమ వేదంగా పరిగణిస్తారు. అయితే ఇప్పటికీ మన పెద్దలు  మహా భారతాన్ని ఇంట్లో ఉంచకూడదు లేదా ఇంట్లో పఠించకూడదు. ఇంట్లో పఠిస్తే తగాదాలు పెరుగుతాయని అంటారు. అటువంటి పరిస్థితిలో  మానవ జీవితం ధర్మం గురించి పాఠాలు బోధించే ఈ పవిత్ర గ్రంథాన్ని  ఇంట్లో ఉంచడం ఎందుకు అశుభం అనిఎవరి మదిలోనైనా ప్రశ్న ఉదయిస్తే.. దీని వెనుక ఉన్న నమ్మకం గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం మహాభారతాన్ని టీవీ లేదా మొబైల్‌లో చూస్తున్నారు. మహాభారతం హిందూ మతం పవిత్ర గ్రంథంగా పరిగణించబడుతుంది. మహాభారతాన్ని ఇంట్లో ఉంచడం లేదా పారాయణం చేయడం వల్ల జీవితంలో గొడవలు, దురాశ, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య శత్రుత్వం ఏర్పడుతుందని చెబుతారు. అలాగే మహాభారతానికి సంబంధించిన ఏదైనా వస్తువును ఇంట్లో ఉంచడం వల్ల అశుభాలు జరిగే అవకాశాలు పెరుగుతాయని ఒక నమ్మకం.

మహాభారత పారాయణం అశుభమా?

హిందూ మత విశ్వాసాల ప్రకారం రామాయణం, భగద్గీత మొదలైన గ్రంధాలను ఇంట్లో ఉంచడం..  పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహా భారతాన్ని ఇంట్లో ఉంచడం లేదా చదవడం వల్ల ఇంట్లో అశుభం, ప్రతికూలతలు ఏర్పడతాయని విశ్వాసం. కుటుంబ సభ్యుల మధ్య వాదనలు వంటి సంఘటనలు పెరుగుతాయని ఒక నమ్మకం.

మత విశ్వాసం అంటే ఏమిటి?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహాభారతాన్ని ఖాళీ ప్రదేశంలో పఠిస్తారు. అంతేకాదు ఈ గ్రంథాన్ని పూర్తిగా చదవకుండా ఒక పేజీని విడిచి పెట్టాలని విశ్వాసం. మహాభారతంలో ఒక సోదరుడు సింహాసనం కోసం మరొక సోదరుడికి శత్రువుగా మారి అతని ప్రాణాలను తీయడానికి ప్రయత్నించడం వంటి కొన్ని సంఘటనలు ఈ నమ్మకాల వెనుక కారణాలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పారాయణం చేసినా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మహాభారతం లేదా ఏదైనా హిందూ మతగ్రంధాన్ని ఇంట్లో పెట్టుకోవడం చెడ్డ శకునము లేదా అశుభం కాదు. అయితే మహాభారతాన్ని ఇంట్లో పారాయణం కాకుండా గుడిలోనో, బహిరంగ ప్రదేశంలోనో పారాయణం చేయడం మంచిది.

అందుకే మహాభారతాన్ని ఇంట్లో పెట్టుకోవడం నిషిద్ధం

రామాయణ, మహాభారత యుద్ధాల మధ్య చాలా తేడాలున్నాయి. రామాయణం మనిషి ఎలా జీవించాలో తెలుస్తుంది. ఇక్కడ జరిగిన యుద్ధం సత్యం కోసం జరిగింది. అయితే మహాభారతంలో యుద్ధం మోసంతో జరిగింది. రామాయణ యుద్ధంలో రాముడు రాక్షసులతో పోరాడాడు. మహాభారతంలో సింహాసనంపై దురాశతో ఒక సోదరుడు మరొక సోదరుడితో పోరాడాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో పారాయణం చేస్తే సోదరుల మధ్య వివాదాలు, దురాశ కలగవచ్చు అని నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా మహాభారత పుస్తకాన్ని ఇంట్లో ఉంచరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
Weekly Horoscope: ఒత్తిళ్లు, సమస్యల నుంచి వారికి ఉపశమనం..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?