AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రక్తంతో బిజినెస్‌.. తెలంగాణలో ప్లాస్మా మాఫియా.. వెలుగులోకి సంచలన నిజాలు..

సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో తెలంగాణపై మత్తు మరక లేకుండా డ్రగ్‌ మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. రీసెంట్‌గా నల్లగొండలో డ్రగ్‌ మాఫియాకు చెక్‌ పెట్టారు. శస్త్ర చికిత్సల్లో వాడే టాబ్లెట్లను.. ఇంజక్షన్లను నిబంధనలకు విరుద్ధంగా మత్తుబాబులకు అమ్మిసొమ్ము చేసుకుంటోన్న కేటుగాళ్లను కటకటాల బాటపట్టించారు.

Hyderabad: రక్తంతో బిజినెస్‌.. తెలంగాణలో ప్లాస్మా మాఫియా.. వెలుగులోకి సంచలన నిజాలు..
Plasma
Shaik Madar Saheb
|

Updated on: Feb 03, 2024 | 9:00 AM

Share

అసలే కలికాలం.. అడుగడుగునా దగా దగానే. నెత్తురు కళ్లజూసే క్రిమినల్స్‌ నిర్వాకాలు ఎన్నెన్నో. వాళ్లను మించి నెత్తురు కూడు రుచి మరిగిన కేటుగాళ్లూ ఉన్నారు. ప్రాణదాతలు జేజేలు అందుకోవాల్సింది పోయి.. రక్తంతో బిజినెస్‌ చేస్తున్నారు. డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీల్లో ప్లాస్మా మాఫియా పాపం పండి నెత్తుటి చాటు నిజాలు బయటపడ్డాయి.. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో తెలంగాణపై మత్తు మరక లేకుండా డ్రగ్‌ మాఫియా పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. రీసెంట్‌గా నల్లగొండలో డ్రగ్‌ మాఫియాకు చెక్‌ పెట్టారు. శస్త్ర చికిత్సల్లో వాడే టాబ్లెట్లను.. ఇంజక్షన్లను నిబంధనలకు విరుద్ధంగా మత్తుబాబులకు అమ్మిసొమ్ము చేసుకుంటోన్న కేటుగాళ్లను కటకటాల బాటపట్టించారు. మత్తు మందుల గ్యాంగ్‌ల బెండు తీయడం మాత్రమే కాదు. మరో మార్పు కూడా మొదలైంది. ఆదాయానికి మించి ఆస్తులున్న అక్రమార్కుల భరతం పడుతోంది ఏసీబీ. ఏసీబీ విచారణలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలక్రిష్ణ అక్రమాస్తుల కేసులో సంచలనం వెలుగుచూస్తున్నాయి. ఐతే అవినీతి తిమింగలు కోట్లకు కోట్లు మింగుతుంటే మరోవైపు సామాన్యుల రక్తం తాగుతోన్న అవినీతి జలగల బాగోతం తాజాగా తెరపైకి వచ్చింది. డ్రగ్‌ కంట్రోల్‌ దాడుల్లో బ్లడ్‌ బ్యాంక్‌ల్లో ఫ్లాస్మా మాఫియా నిర్వాకం బయటపడింది.

ప్రాణాలను కాపాడే పవిత్ర వృత్తికి కళంకం తెస్తూ డబ్బు కోసం గడ్డి తింటున్నారు కొందరు కేటుగాళ్లు. బ్లడ్‌ బ్యాంక్‌ల ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మాను సేకరించి.. అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్న వైనం కలకలం రేపింది. పక్కా నిఘా పెట్టిన డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పలు బ్లడ్‌ బ్యాంక్‌ల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భారీగా ప్లాస్మా యూనిట్లను స్వాధీనం చేసుకున్నారు.

సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్‌.ఆర్‌ బ్లడ్ బ్యాంక్‌ సహా క్లిమెన్స్‌, క్లినోవి రీసెర్చ్‌, నవరీచ్ క్లినిక్‌, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్‌ బయోసర్వీస్‌, శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్‌, వింప్టా ల్యాబ్‌లో నెత్తుటి చాటు దగానిజాలు బయటపడ్డాయి. పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ దందా ఎన్నాళ్ల నుంచి సాగుతోంది. ఈ రాకెట్‌ వెనుక ఇంకా ఎవరున్నారనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..