AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫ్యాన్‌పై సేదదీరుతోన్న సర్ప రాజు.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..

ఇదిలా ఉంటే స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడం, సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో ఇలాంటి వన్యప్రాణాలకు సంబంధించిన వీడియోలు ఇట్టే వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఓ కింగ్‌ కోబ్రాకు సంబంధించిన వీడియో భయపెడుతోంది...

Viral Video: ఫ్యాన్‌పై సేదదీరుతోన్న సర్ప రాజు.. వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే..
Viral Video
Narender Vaitla
|

Updated on: Feb 03, 2024 | 3:53 PM

Share

అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడం ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి. అటవీ ప్రాంతం తగ్గిపోవడం, అడవుల్లో వాటికి కావాల్సిన సహజ వనరులు తగ్గడం కారణం ఏదైనా వణ్యప్రాణులు ప్రజల మధ్యలోకి వస్తున్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇదిలా ఉంటే స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి రావడం, సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో ఇలాంటి వన్యప్రాణాలకు సంబంధించిన వీడియోలు ఇట్టే వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. ఓ కింగ్‌ కోబ్రాకు సంబంధించిన వీడియో భయపెడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఓ పాము ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ ఇంటి పైకప్పు ఎక్కేసింది.

వైరల్ వీడియో..

అంతటితో ఆగకుండా ఎంచక్కా ఫ్యాన్‌పైకి ఎక్కి చేరింది. దీంతో ఇంట్లోని వారు ఫ్యాన్‌ స్విచ్‌ను ఆన్‌ చేశారు. అయినా ఆ పాము అక్కడే ఎంచక్కా సేద తీరింది, తప్ప కిందికి దూకలేదు. ఉన్నపలంగా ఒక్కసారిగా నాగపాము కనిపించడంతో ఇంట్లో ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు. దీనంతటినీ స్మార్ట్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసి వారంతా షాక్‌ అవుతున్నారు. ఇంతకీ ఆ పాము అసలు అక్కడికి ఎలా వచ్చింది అంటూ నెటిజన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో చూసిన తర్వాత ఫ్యాన్‌పైకి చూడగానే ఏదో తెలియని భయం రావడం ఖాయం కదూ!

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..