AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అచ్చం సినిమా స్టోరీనే.. పుట్టిన వెంటనే కవల పిల్లలను అమ్మేసిన తండ్రి.. 19 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే..

అమీ ఖ్వితియా, అనో సర్తానీలు ఒకే తల్లికి జన్మించారు. అయితే పుట్టిన వెంటనే ఇద్దరి పిల్లలను వేర్వేరు కుటుంబాలకు అమ్మేశారు. దీంతో ఒకరికొకరు తెలియకుండా ఇద్దరూ జార్జియాలో కొన్ని మైళ్ల దూరంలో నివసిస్తున్నారు. కవల సోదరీమణులు అని ఇద్దరికీ తెలియదు. అయితే ఒక టాలెంట్ షో, టిక్‌టాక్ వీడియోలో అమీ, అనో కవల సోదరీమణులను కలిపింది. వీరిద్దరూ ఎలా వేరు చేయబడ్డారో వెల్లడించింది.

Viral News: అచ్చం సినిమా స్టోరీనే.. పుట్టిన వెంటనే కవల పిల్లలను అమ్మేసిన తండ్రి.. 19 ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే..
Twins Separated At BirthImage Credit source: Facebook/SartaniaAnno
Surya Kala
|

Updated on: Jan 30, 2024 | 12:24 PM

Share

కవల అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో రకరకాల సినిమాలను చూస్తూనే ఉంటాం.. ముఖ్యంగా అప్పట్లో వాణిశ్రీ నటించిన గంగ మంగ సినిమా ఓ సెన్షేషల్.. ఒకేసారి పుట్టిన కవల పిల్లలు అనుకోని పరిస్థితుల్లో వేరు అయ్యి… మళ్లీ తిరిగి కలుస్తారు. అయితే నిజ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతాయని మీరు ఎప్పుడైనా ఊహించారా,.. జార్జియాలో జరిగిన ఒక షాకింగ్ స్టోరీ వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు కవల సోదరీమణులు జన్మించిన వెంటనే విడిపోయారు.. అయితే 19 సంవత్సరాల తర్వాత ఒక వైరల్ వీడియో వారిద్దరిని తిరిగి కలిపింది.

అమీ ఖ్వితియా, అనో సర్తానీలు ఒకే తల్లికి జన్మించారు. అయితే పుట్టిన వెంటనే ఇద్దరి పిల్లలను వేర్వేరు కుటుంబాలకు అమ్మేశారు. దీంతో ఒకరికొకరు తెలియకుండా ఇద్దరూ జార్జియాలో కొన్ని మైళ్ల దూరంలో నివసిస్తున్నారు. కవల సోదరీమణులు అని ఇద్దరికీ తెలియదు. అయితే ఒక టాలెంట్ షో, టిక్‌టాక్ వీడియోలో అమీ, అనో కవల సోదరీమణులను కలిపింది. వీరిద్దరూ ఎలా వేరు చేయబడ్డారో వెల్లడించింది. పుట్టిన వెంటనే విడిపోయిన ఇద్దరు కవల అక్కచెల్లెలు చివరకు 19 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.

BBC ప్రకారం జార్జియాలో ఆసుపత్రుల నుండి పిల్లలను దొంగిలించడం, విక్రయించడం వంటి సంఘటనలు సాధారణం. ఇది ఇప్పటివరకు అరికట్టబడలేదు. వాస్తవానికి అమీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. తన ఫేవరేట్ టీవీ షో ‘జార్జియాస్ గాట్ టాలెంట్’లో తనలానే ఉన్న ఓ అమ్మాయిని చూసింది. అయితే అప్పుడు అమీకి ఆమె తన సోదరి అన్న విషయం తెలియదు. అదే సమయంలో అనో కూడా టిక్ టాక్ లో ఓ వీడియోలో ఉన్న అమ్మాయి తనలా ఉన్నట్లు చూసింది. వారిద్దరూ తాము ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలం అని అనుకోలేదు. అప్పుడు ఇద్దరూ ఇది కేవలం యాదృచ్చికంగా భావించారు.

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం కొంచెం పెద్ద అయిన తర్వాత ఒక రోజు టిక్‌టాక్‌లో అమీకి చెందిన మరొక వీడియో కనిపించింది. అప్పుడు అనో ఎందుకనో తామిద్దరికి మధ్య ఏదో బంధం ఉందని ఆలోచించింది. ఆ తరువాత అక్కచెల్లెలు ఇద్దరూ మొదటిసారిగా రాజధాని టిబిలిసిలోని రుస్తావేలీ వంతెనపై ఒకరినొకరు కలుసుకున్నారు.  2002లో అంటే 19 సంవత్సరాల జన్మించి అప్పుడు విడిపోయిన కవల సోదరీమణులు ఇద్దరూ మళ్ళీ రెండేళ్ల క్రితం కలుసున్నారు.

2002లో వీరికి జన్మనిచ్చిన తర్వాత వారి తల్లి అజా షోని కోమాలోకి వెళ్ళింది. దీంతో ఆమె భర్త గోచా గఖారియా అనో, అమీని వేర్వేరు కుటుంబాలకు అమ్మసినట్లు అక్కచెల్లెలు కలుసుకున్న తర్వాత వెలుగులోకి వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..