AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీడు కొడుకు కాదు రాక్షసుడు.. అంధురాలైన తల్లిని కొట్టి చంపిన తనయుడు.. పిచ్చి అంటూ తప్పించుకునే ప్రయత్నం..

ఈ విషాద ఘటన కన్నౌజ్ జిల్లాలోని తిర్వా కొత్వాలి ప్రాంతంలోని గాంధీనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడే నివాసం ఉంటున్న 75 ఏళ్ల రాందేవిని ఆమె కొడుకు హత్య చేశాడు. రాందేవి అంధురాలు.. దీంతో తన కొడుకు తనపై దాడి చేస్తున్న విషయాన్నీ గుర్తించలేకపోయింది. నిందితుడు కల్లు తన వృద్ధ తల్లిని కర్రతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం వైద్య కళాశాలకు తరలించారు

వీడు కొడుకు కాదు రాక్షసుడు.. అంధురాలైన తల్లిని కొట్టి చంపిన తనయుడు.. పిచ్చి అంటూ తప్పించుకునే ప్రయత్నం..
Son Killed Blind Mother
Surya Kala
|

Updated on: Mar 08, 2024 | 8:46 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఒక కొడుకు తన వృద్ధ అంధ తల్లిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. తల్లిని హత్య చేసిన తర్వాత నిందితుడు కొడుకు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గతంలో కూడా నిందితుడైన కొడుకు తన తల్లిని కొట్టేవాడని ఇరుగు పొరుగు చెబుతున్నారు.

మృతురాలి కుమార్తె తన తల్లిని హత్య చేసినట్లు నిందితుడి తో పాటు పలువురు కుటుంబ సభ్యులపై ఆరోపించింది. నిందితుడి భార్యకు రాజకీయ నేపధ్యం ఉందని కూతురు ఆరోపిస్తోంది. దీంతో తన తల్లి ని చంపిన అతడిని కాపాడే ప్రయత్నం చేస్తోందని చెబుతోంది. నిందితుడిని పిచ్చివాడిగా ప్రకటించాలని అతని భార్య కోరుతోంది. వృద్ధురాలు హత్యకు గురైన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చికిత్స తీసుకుంటూ ఆసుపత్రిలో మృతి..

ఈ విషాద ఘటన కన్నౌజ్ జిల్లాలోని తిర్వా కొత్వాలి ప్రాంతంలోని గాంధీనగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడే నివాసం ఉంటున్న 75 ఏళ్ల రాందేవిని ఆమె కొడుకు హత్య చేశాడు. రాందేవి అంధురాలు.. దీంతో తన కొడుకు తనపై దాడి చేస్తున్న విషయాన్నీ గుర్తించలేకపోయింది. నిందితుడు కల్లు తన వృద్ధ తల్లిని కర్రతో తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఇంటి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని చికిత్స నిమిత్తం వైద్య కళాశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో సంచలనం సృష్టించింది.

ఇవి కూడా చదవండి

అందరూ కలిసి తల్లిని హత్య చేశారంటున్న వృద్ధురాలి కూతురు

‘తల్లి మరణ వార్త తెలిసిన వెంటనే మృతురాలి కుమార్తె ఇంటికి చేరుకుంది. తన తమ్ముడు కల్లు, అతని భార్య, మేనకోడలు కలిసి తల్లిని చంపేశారని ఆరోపించింది. అంతేకాదు నిందితుడు కల్లు భార్యకు రాజకీయ పరిచయాలు ఉన్నాయని చెబుతోంది. తన భర్తను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని.. కల్లును పిచ్చి వాడుగా ముద్రవేసి మరీ కాపాడాలనుకుంటోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..