AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gallstone Symptoms: చేపలు, మాంసాహారం తిన్న తర్వాత మీకూ కడుపు నొప్పి వస్తుందా? జాగ్రత్త.. నిర్లక్ష్యం చేయకండి

వేళ ప్రకారం భోజనం చేయకుంటే కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొన్నిసార్లు మధ్యాహ్న భోజనం 2 గంటలకు, మరికొన్నిసార్లు 4 గంటలకు కూడా భోజనం చేస్తుంటారు. ఇలా వేళలు తప్పి తినడం, తాగడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడమే కాకుండా, సరైన సమయానికి తినడం, త్రాగకపోతే వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. జీర్ణ రుగ్మతలు సర్వసాధారణం. పొత్తికడుపు నొప్పి, మూత్ర సమస్యలు, గురక వంటి లక్షణాలు..

Gallstone Symptoms: చేపలు, మాంసాహారం తిన్న తర్వాత మీకూ కడుపు నొప్పి వస్తుందా? జాగ్రత్త.. నిర్లక్ష్యం చేయకండి
Gallstone Symptoms
Srilakshmi C
|

Updated on: Mar 08, 2024 | 7:33 PM

Share

వేళ ప్రకారం భోజనం చేయకుంటే కలిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు. కొన్నిసార్లు మధ్యాహ్న భోజనం 2 గంటలకు, మరికొన్నిసార్లు 4 గంటలకు కూడా భోజనం చేస్తుంటారు. ఇలా వేళలు తప్పి తినడం, తాగడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడమే కాకుండా, సరైన సమయానికి తినడం, త్రాగకపోతే వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. జీర్ణ రుగ్మతలు సర్వసాధారణం. పొత్తికడుపు నొప్పి, మూత్ర సమస్యలు, గురక వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తాయి. చాలామంది దీనిని ప్రాథమిక స్థాయిలో గుర్తించకపోవచ్చు. కానీ పరీక్షలో పిత్తాశయ రాళ్లు అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వివిధ వయసుల వారు ఈ గాల్ బ్లాడర్ స్టోన్ సమస్యలతో బాధపడుతున్నారు. పిత్తాశయంలో ఏర్పడే చిన్న రాళ్లను గాల్ బ్లాడర్ రాళ్లు అంటారు. ఈ రాళ్లు కాలేయం కింది భాగంలో ఉంటాయి. పిత్తాశయంలో కొలెస్ట్రాల్ చేరి గట్టిపడటం వల్ల, రాళ్లుగా మారుతాయి. ఇలా రాళ్లు ఏర్పడితే భరించలేని నొప్పి వస్తుంది. దానితో పాటు ఆహారం జీర్ణం కావడంలో సమస్య తలెత్తుతుంది.

ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండటం వల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే, వైద్యులు ప్రతి 2-3 గంటలకు కొద్ది మొత్తంలో భోజనం తినాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది మంచి జీర్ణ ఆరోగ్యాన్ని కలిగే చేస్తుంది. అలాగే బరువు పెరిగినా గాల్ బ్లాడర్ పై ఒత్తిడి పడుతుంది. యువకులలో పిత్తాశయంలో రాళ్లు చాలా సాధారణం. మధుమేహం సమస్య ఉన్నవారిలో కూడా, పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి. పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని నివారించడానికి సరైన సమయంలో తినడం, తాగడం చాలా అవసరం. దానితోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అదనంగా, శరీరంలో నీటి లోపం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, అదనపు జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. అయితే గాల్ బ్లాడర్ స్టోన్ లక్షణాలు ఏమిటి? వీటిని సకాలంలో ఎలా గుర్తించాలి అనే విషయాలు నిపుణుల మాటల్లో..

ఇవి కూడా చదవండి

ఆ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకండి..

  • మసాలా లేదా చేప, మాంసం వంటి నాన్‌ వెజ్‌ ఆహారాలు తిన్న తర్వాత కడుపు నొప్పి, పొత్తికడుపు పైభాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. వాంతులతో పాటు కడుపు నొప్పి, కొన్నిసార్లు చలి, జ్వరం వస్తుంది.
  • గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంటే కడుపు కుడి వైపున తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఛాతీకి దిగువన ఉదరం మధ్యలో తీవ్రమైన నొప్పి తలెత్తుతుంది. చాలామందిలో భుజం, వెన్నునొప్పి కూడా ఉంటుంది.
  • పిత్తాశయంలో రాళ్లు జాండిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కళ్లు పసుపు రంగులోకి మారడం, వాంతులు కావడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • మూత్రం రంగును చూస్తే గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్నాయో లేదో అర్థం చేసుకోవచ్చు. మూత్రం ముదురు గోధుమ రంగులో ఉంటే, గాల్ బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయని అర్ధం. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.