AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Food: మధ్యాహ్నం భోజనంలో ఈ ఫుడ్స్ తింటే బోలెడన్ని బెనిఫిట్స్..

ఆరోగ్యంగా, అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ అలా ఉండేందుకు చేయాల్సిన పనులను మర్చిపోతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మారని బీజీ లైఫ్ కారణంగా ఏమి తింటున్నారో.. ఎప్పుడు పడుకుంటున్నారో.. ఎలా జీవనం గుడపుతున్నారో వారికే తెలీడం లేదు. తీని వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. వారికి తెలియకుండానే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మీ లైఫ్ స్టైల్‌ని కాస్త మార్చి.. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి జీవన శైలిని అలవరచుకుంటే..

Healthy Food: మధ్యాహ్నం భోజనంలో ఈ ఫుడ్స్ తింటే బోలెడన్ని బెనిఫిట్స్..
Lunch
Chinni Enni
|

Updated on: Feb 08, 2024 | 12:03 PM

Share

ఆరోగ్యంగా, అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ అలా ఉండేందుకు చేయాల్సిన పనులను మర్చిపోతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మారని బీజీ లైఫ్ కారణంగా ఏమి తింటున్నారో.. ఎప్పుడు పడుకుంటున్నారో.. ఎలా జీవనం గుడపుతున్నారో వారికే తెలీడం లేదు. తీని వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి. వారికి తెలియకుండానే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మీ లైఫ్ స్టైల్‌ని కాస్త మార్చి.. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి జీవన శైలిని అలవరచుకుంటే.. అందంగా, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యం అనేది ముఖ్యంగా మీరు తినే ఆహారంపై ఆధార పడి ఉంటుంది. మధ్యాహ్నం తినే భోజనం కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం పడేలా చేస్తుంది. ఇది శరీరం, మెదడు సమర్థవంతంగా పని చేసేందుకు అవసరం అయిన పోషకాలను, శక్తిని అందిస్తుంది. మరి మధ్యాహ్నం భోజనంలో ఎలాంటి ఆహారాలు ఉండాలో తెలుసుకోండి.

మధ్యాహ్నం భోజనంలో తీసుకోవాల్సిన ఆహారాలు:

1. సలాడ్లు:

సలాడ్లు అనేవి కేవలం ఉదయం, సాయంత్రం మాత్రమే కాదు. మధ్యాహ్నం భోజనం చేసే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సలాడ్స్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, పలు రకాల ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

2. పెరుగు:

చాలా పెరుగు తింటే నిద్ర వస్తుంది అనుకుంటారు. నిజానికి భోజనం చివరిలో పెరుగు తీసుకోవడం వల్ల నిద్ర రాకుండా చూస్తుంది. పెరుగును లంచ్‌లో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణ క్రియ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. చర్మానికి తేమను కూడా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

3. ధాన్యాలు:

మధ్యాహ్న భోజనంలో క్వినోవా, రోటీ, బ్రౌన్ రైస్ వంటి తృణ ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి తినడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ అనేవి పెరుగుతాయి.

4. పండ్లు:

మీరు ఆరోగ్యంగా ఉండి పని చేయాలంటే మీకు తగినన్ని పోషకాలు అవసరం. కాబట్టి మధ్యాహ్న భోజనం తర్వాత పండ్లు తీసుకునేలా ప్లాన్ చేయండి. దీని వల్ల మంచి పోషకాలు మీకు అందుతాయి. అంతే కాకుండా ఇవి మీ బరువును కూడా నియంత్రణంలో ఉండేలా చేస్తుంది.

5. లీన్ ప్రోటీన్:

లంచ్‌లో లీన్ ప్రోటీన్ కూడా ఉండాలి. కానీ మితంగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ కేలరీలు, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల.. జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్తాయిలు పెరుగుతాయి. కాబట్టి లీన్ ప్రోటీన్ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్