అరటి ఆకుల్లో భోజనంతో తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం.. ఇలా వాడితే అందం రెట్టింపు ..

ఈ పోషకాలలో కొన్ని ఆహారంలోకి బదిలీ అవుతాయి. దాని పోషక విలువను మెరుగుపరుస్తాయి. అరటి ఆకులు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా సులభంగా భూమిలో కలిసిపోతాయి. అంతేకాదు..చాలా సార్లు ఆహారం మిగిలిపోయి భద్రంగా ఉంచాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అటువంటి సందర్భాలలో మీరు అరటి ఆకుల సహాయం తీసుకోవచ్చు. అరటి ఆకులో ఆహారాన్ని చుట్టి నిల్వచేయటం వల్ల త్వరగా పాడవదు. అంతేకాదు.. అరటి ఆకులో తినడం

అరటి ఆకుల్లో భోజనంతో తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం.. ఇలా వాడితే అందం రెట్టింపు ..
Banana Leaf Health Benefits
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 08, 2024 | 9:47 AM

పూర్వకాలంలో ప్రజలు ఎక్కువగా అరటి ఆకులలోనే భోజనం చేసేవారు. కానీ, ప్రస్తుతం వాటి స్థానంలో అనేకం వచ్చి చేరాయి. దాంతో ఇప్పుడు అరటి ఆకులను వివాహం, పూజ లేదా ఇతర పండుగల వంటి శుభ కార్యాలలో మాత్రమే కనిపిస్తున్నాయి. అది కూడా కొందరు మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ, అరటి ఆకుల్లో శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ విధమైన సంప్రదాయం మన దేశంలో ప్రాచీన కాలం నుండి కొనసాగుతోంది. అంతేకాదు.. అరటి ఆకులో ఆహారం తీసుకోవడం పవిత్రంగా భావిస్తారు. దీనికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా శాస్త్రీయ నేపథ్యం కూడా ఉంది. అరటి ఆకులో తినడం వల్ల ఆహారం రుచి, వాసన పెరుగుతుందని నమ్ముతారు, ఎందుకంటే ఈ ఆకు వంటకు సూక్ష్మమైన రుచిని ఇస్తుంది. ఇలా అరటితో మరెన్నో లాభాలున్నాయి.

ముఖ్యంగా అరటి ఆకులలో కొన్ని యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తాయి. అరటి ఆకులలో సహజ యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆహారంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. అరటి ఆకులో తినే ఆహారం అనేక అనారోగ్యాలను దరి చేరకుండా చేస్తుంది. అరటి ఆకులలో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాలలో కొన్ని ఆహారంలోకి బదిలీ అవుతాయి. దాని పోషక విలువను మెరుగుపరుస్తాయి. అరటి ఆకులు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా సులభంగా భూమిలో కలిసిపోతాయి. అంతేకాదు..చాలా సార్లు ఆహారం మిగిలిపోయి భద్రంగా ఉంచాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అటువంటి సందర్భాలలో మీరు అరటి ఆకుల సహాయం తీసుకోవచ్చు. అరటి ఆకులో ఆహారాన్ని చుట్టి నిల్వచేయటం వల్ల త్వరగా పాడవదు. అంతేకాదు.. అరటి ఆకులో తినడం జుట్టుకు కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అరటి ఆకును నిత్యం తింటే జుట్టు నల్లగా మెరుస్తుందని చెబుతున్నారు.

అరటి ఆకు కాలిన గాయాల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది. అరటి ఆకుపై అల్లం నూనెను చిలకరించి, శరీరం కాలిన భాగంలో పై నుండి క్రిందికి చుట్టండి. ఇది వేడి, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే అరటి ఆకుల్లో ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్, ఇజిసిజి వంటి పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. అరటి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది. అలాగే రాత్రిపూట అంధత్వం వంటి వ్యాధుల నుంచి బయటపడవచ్చు. అరటి ఆకుల్లో ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు చేస్తుంది. సాధారణంగా చర్మంపై అల్సర్లు, మొటిమలు, మచ్చలు కనిపించవచ్చు. అలాంటప్పుడు అరటి ఆకుపై కొబ్బరి నూనె రాయండి. దీన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే