Bathing tips : తలస్నానం ఎలా చేస్తున్నారు..? ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే..

అయితే, ప్రతి రోజూ తలస్నానం చేస్తే మంచిదా..? అలా రోజూ తలస్నానం చేయడం, అది కూడా వేడినీటితో తరచూ జుట్టును ఆరోగ్యకరమేనా..? అన్న విషయం ఎప్పుడైనా ఆలోచించరా..? తలస్నానం చేయటం, వేడి నీటితో చేయటం మంచిదా..? లేదంటే చన్నీటి స్నానం చేస్తే మంచిదా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

Bathing tips : తలస్నానం ఎలా చేస్తున్నారు..? ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే..
Bathing Care
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 08, 2024 | 9:13 AM

కొందరు ప్రతి రోజూ తల స్నానం చేస్తారు. మరికొందరు. వారంలో రెండు మూడు సార్లు మాత్రమే తలస్నానం చేస్తారు. ఇక కొంతమందికి వర్షం, ఎండ లేదా చలి అనే తేడా లేకుండా సంవత్సరంలో మూడు సీజన్లలో వేడి నీటితోనే స్నానం చేస్తుంటారు. వేడి వేడి నీళ్లతో తల స్నానం చేస్తే హాయిగా ఉంటుందని భావిస్తారు. అయితే, ప్రతి రోజూ తలస్నానం చేస్తే మంచిదా..? అలా రోజూ తలస్నానం చేయడం, అది కూడా వేడినీటితో తరచూ జుట్టును ఆరోగ్యకరమేనా..? అన్న విషయం ఎప్పుడైనా ఆలోచించరా..? తలస్నానం చేయటం, వేడి నీటితో చేయటం మంచిదా..? లేదంటే చన్నీటి స్నానం చేస్తే మంచిదా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

మన స్కాల్ప్‌లో సహజసిద్ధమైన నూనెలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణనిచ్చి మెరిసేలా చేస్తాయి. జుట్టును వేడి నీళ్లతో కడుక్కుంటే తలలోని సహజ నూనెలు ప్రభావితమవుతాయి. దీంతో జుట్టు నిర్జీవంగా పొడిబారడం ప్రారంభమవుతుంది. వేడినీళ్ళతో తల స్నానం చెయ్యటం వలన జుట్టు పొడిబారటం, వెంట్రుకలు చిట్లిపోవటం, వెంట్రుకలు నిర్జీవంగా మారటం మొదలవుతుంది. తలపై చిరాకు, చుండ్రు పెరుగుతుంది. బాగా వేడి నీటితో తలస్నానం చేయటం వలన స్కాల్ప్ రంధ్రాలు తెరుచుకుని, జుట్టు మూలాలలో బలహీనపడుతుంది. వేడినీళ్లతో జుట్టు కడుక్కోవడం వల్ల జుట్టులో ఉండే కెరాటిన్ ప్రోటీన్ కరిగిపోయి జుట్టు డ్యామేజ్ అవుతుంది. ఇలా వేడి నీరు మన జుట్టును పాడు చేస్తుంది. అయితే, గోరువెచ్చని నీటితో జుట్టును కడుక్కోవడం వల్ల జుట్టుకు ఎలాంటి నష్టం జరగదు.

సాధారణ నీటి కంటే వేడి నీరు, జుట్టు రంగు మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది జుట్టు కుదుళ్లను తెరుస్తుంది. దీని వల్ల రంగు కూడా బయటకు వస్తుంది. అందువలన జుట్టు రంగు చాలా త్వరగా వాడిపోతుంది. చలికాలంలో జుట్టులో చుండ్రు రావడానికి వేడి నీళ్లతో తలస్నానం చేయడం ప్రధాన కారణం. వేడి నీళ్లతో జుట్టును కడుక్కోవడం వల్ల చుండ్రు పెరుగుతుంది. ఇది చుండ్రు, దురద సమస్యలను కలిగిస్తుంది.వేడి నీరు తలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. తద్వారా జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది. జుట్టు రాలే ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే