ఇంత అందమైన అమ్మాయికి ఇదో మాయరోగం..! ప్రపంచవ్యాప్తంగా కేవలం 37 మందికి మాత్రమే ఇలాంటి అరుదైన వ్యాధి..?

ఈ వ్యాధి కారణంగా తన మానసిక స్థితి కూడా బాగా ప్రభావితమైందని యువతి ఆవేదనగా చెప్పింది.. సరిగ్గా స్నానం చేయలేక ఆమె తనను తాను అసహ్యించుకోవడం ప్రారంభించింది. సోష‌ల్ మీడియా ద్వారా స్నానం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఓ వర్గం గురించి తెలుసుకుంది. ఆ తర్వాత ఆ వ్యక్తులను కలిసిన ఈ అమ్మాయి ఒకింత ఆనందంగా భావించి ఆ గ్రూపులో చేరింది.

ఇంత అందమైన అమ్మాయికి ఇదో మాయరోగం..! ప్రపంచవ్యాప్తంగా కేవలం 37 మందికి మాత్రమే ఇలాంటి అరుదైన వ్యాధి..?
Water Allergy
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 06, 2024 | 1:15 PM

ఎవరైనా నీటికి అలెర్జీ కలిగి ఉంటారా..? ఎవరికైనా నీటితో అలర్జీ కలిగితే.. వారి జీవితం ఎలా ఉంటుంది. నీటి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలి..? అనేది నిజంగా భయంకరమైన పరిస్థితి అని చెప్పాలి. కానీ, ఒక అమ్మాయికి నీళ్లంటే అలర్జీ, నీళ్లలో స్నానం చేస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. ఈ 22 ఏళ్ల అమ్మాయి 12 ఏళ్ల వయసులో దురద సమస్యతో వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు ఈ అలర్జీ గురించి తెలిసింది. అప్పుడు డాక్టర్ ఇది అరుదైన వ్యాధి అని, ఇలాంటి వ్యాధితో కేవలం 37 మంది మాత్రమే బాధపడుతున్నారని చెప్పారు. ఇంతకీ ఆ యువతికి వచ్చిన వ్యాధి ఏంటి..? వివరాల్లోకి వెళితే..

నీటికి అలెర్జీ..

ఈ 22 ఏళ్ల యువతి పేరు లారెన్ మోంటెఫుస్కో. ఆమెకు నీళ్లంటే ఎలర్జీ. అందుకే ఆమె స్నానం చేయడం మానేసింది.. నీళ్లలో స్నానం చేసిన వెంటనే ఆమె శరీరమంతా దురదలు మొదలవుతాయని, దద్దుర్లు కూడా వస్తున్నాయని బాధిత యువతి చెప్పింది, దురద తీవ్రంగా ఉందని, తట్టుకోవడం కష్టంగా మారిందని వాపోయింది. లారెన్ మోంటెఫుస్కో కలిగి ఉన్న సమస్యను ఆక్వాజెనిక్ ఉర్టికేరియా అంటారు. అందుకున్న సమాచారం ప్రకారం, ఇప్పటివరకు కేవలం 37 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో ప్రజలు నీటికి అలెర్జీ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే 22 ఏళ్ల బాధిత యువతి.. తాను స్నానం చేసినప్పుడు లేదా నీటిని తాకినప్పుడు, తన దురద గంటసేపు ఉంటుంది. దురద చర్మంపై కాకుండా లోపల నుండి వచ్చినట్లు అనిపిస్తుందని చెప్పారు. ఆ బాధను భరించలేకపోయానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

12 సంవత్సరాల వయస్సులో వ్యాధి నిర్ధారణ..

స్నానం చేయడానికి బదులుగా ఈ అమ్మాయి బాడీ వైప్స్ ఉపయోగిస్తుంది. లారెన్ మోంటెఫుస్కో ఆమె త్వరగా స్నానం చేసి, తన శరీరాన్ని తుడుచుకుని, దుస్తులు ధరిస్తానని చెప్పింది. శరీరంపై నీటి వినియోగాన్ని తగ్గించడానికి, తాను డ్రై షాంపూని ఉపయోగిస్తానని చెప్పింది. ఆమె 12 సంవత్సరాల వయస్సులో ఈ సమస్య గురించి తెలుసుకుంది. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లింది. అప్పుడే ఆమెకు ఈ అలెర్జీ గురించి తెలిసిందట.

ఈ వ్యాధి కారణంగా తన మానసిక స్థితి కూడా బాగా ప్రభావితమైందని యువతి ఆవేదనగా చెప్పింది.. సరిగ్గా స్నానం చేయలేక ఆమె తనను తాను అసహ్యించుకోవడం ప్రారంభించింది. సోష‌ల్ మీడియా ద్వారా స్నానం చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఓ వర్గం గురించి తెలుసుకుంది. ఆ తర్వాత ఆ వ్యక్తులను కలిసిన ఈ అమ్మాయి ఒకింత ఆనందంగా భావించి ఆ గ్రూపులో చేరింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..