Funny Video : ఛీ ఛీ.. వీడేం మనిషి..! మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు..? వైరల్‌ వీడియో

ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా సులువుగా సీటు సంపాదించే ఈ విధానం చాలా సరదాగా ఉందని ఒకరు రాశారు. ముందుగా పారిపోయిన అమ్మాయిని చూస్తుంటే ఏదో భయంగా అనిపించిందని ఒకరు రాశారు. అతను సినిమాల్లో పనిచేయాలని, ప్రజలను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాడని ఒకరు రాశారు.

Funny Video : ఛీ ఛీ.. వీడేం మనిషి..! మెట్రోలో సీటు కోసం.. ఎంత పని చేశాడు..? వైరల్‌ వీడియో
Funny Video Viral
Follow us

|

Updated on: Mar 06, 2024 | 12:52 PM

మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా సార్లు కూర్చోవడానికి సీటు దొరకదు. అటువంటి పరిస్థితిలో ప్రజలు నిలబడి ప్రయాణిస్తారు. ఎవరైనా లేచే వరకు వేచి ఉంటారు. ఒక ప్రయాణీకుడు రైల్లోకి ఎక్కినప్పుడు ట్రైన్‌లో ఒక్క సీటు కూడా లేదు.. అందరూ కూర్చుని ఉన్నారు. తను కూర్చోవడానికి ఖాళీ సీటు లేకపోవడంతో ఆ వ్యక్తి వ్యక్తి నిలబడి ఉన్నాడు. అకస్మాత్తుగా అతడు చేసిన పనితో మెట్రో కోచ్ మొత్తం ఖాళీ అయింది. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి డ్రామా చూసి జనం పరుగులు తీశారు. ఇంతకీ అతడు ఏం చేశాడు.. మెట్రోలో జనం ఎందుకు లేచి పారిపోయారో ఇక్కడ తెలుసుకుందాం..

వైరల్ వీడియోలో మెట్రోలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ప్రయాణికులు మెట్రోలోని దాదాపు అన్ని సీట్లలో కూర్చున్నారు. చుట్టూ చూసి ఎక్కడా ఖాళీ సీటు కనిపించక పోవడంతో అతడు ఒక ట్రిక్‌ ప్లే చేశాడు… తనకు హెల్త్‌ బాగోలేనట్టుగా, తను వాంతి చేసుకుంటున్నట్లుగా డ్రమా మొదలుపెట్టాడు. వామ్‌టింట్‌ చేసుకుంటున్నట్టుగా నోటికి చేతులు అడ్డుపెట్టుకుంటూ వాంతులు ఆపుకుంటున్నట్టుగా ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి వాంతులు చేసుకుంటున్నాడని భావించిన ఇతర ప్రయాణికులు అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభించారు. కొన్ని సెకన్లలో, కోచ్‌లోని దాదాపు ప్రయాణీకులందరూ పారిపోయారు. అన్ని సీట్లు ఖాళీ కావడంతో, అతను అక్కడే కూర్చున్నాడు. ఈ వీడియో వైరల్‌గా మారుతోంది. దీనిపై ప్రజలు ఫన్నీ కామెంట్‌లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో @deham4ik అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయబడింది, దీనిని 161 మిలియన్ల మంది వీక్షించారు. ఇక సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై ప్రజలు భారీగా స్పందించారు. ఇది చూసిన తర్వాత నవ్వు ఆపుకోలేకపోతున్నాను అని ఒకరు రాశారు. ఇంతమంది దయగలవారు, అడగకుండానే సీట్లు ఇచ్చారని ఒకరు రాశారు. ఇండియాలో ఎవరైనా ఇలా చేస్తే ఆసక్తికరమైన ఫలితాలు వస్తాయని ఒకరు రాశారు. రైల్లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు నేను కూడా ఈ ట్రిక్ ఉపయోగిస్తానని ఒకరు రాశారు. రద్దీగా ఉండే మెట్రోలో సీటు పొందడానికి మాకు ఇంత అద్భుతమైన ఆలోచన ఇచ్చినందుకు థ్యాంక్స్‌ బ్రో మరికొందరు కామెంట్‌ చేశారు.

ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా సులువుగా సీటు సంపాదించే ఈ విధానం చాలా సరదాగా ఉందని ఒకరు రాశారు. ముందుగా పారిపోయిన అమ్మాయిని చూస్తుంటే ఏదో భయంగా అనిపించిందని ఒకరు రాశారు. అతను సినిమాల్లో పనిచేయాలని, ప్రజలను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నాడని ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles