Lipstick Side Effects: అందంగా కనిపించాలని లిప్‌స్టిక్‌ ఎక్కువగా వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త..

ఎక్కువ సేపు లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల పెదవుల రంగు ముదురుతుంది. అంతేకాదు..మనం ఆహారం తిన్నప్పుడు, లిప్‌స్టిక్‌లోని కొన్ని భాగాలు మన శరీరంలోకి వెళ్తాయి. దాంతో ఇది కడుపు సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, లిప్‌స్టిక్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

Lipstick Side Effects: అందంగా కనిపించాలని లిప్‌స్టిక్‌ ఎక్కువగా వేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త..
Lipstick Side Effects
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 06, 2024 | 9:13 AM

చాలా మంది ఆడవాళ్లు, మేకప్‌ ప్రియులు లిప్ స్టిక్ వేసుకోవడానికి ఇష్టపడతారు. అందంగా కనిపించాలనే ఆరాటంతో ఓ తెగ పూసేస్తుంటారు. కానీ అందులో కొన్ని హానికరమైన రసాయనాలు ఉన్నాయని మీకు తెలుసా? సౌందర్యం కోసం రుద్దుకునే లిప్‌స్టిక్‌ అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుందని తెలిస్తే షాక్‌ అవుతారు. మీరు కూడా మీ అందాన్ని పెంచుకోవడానికి రోజూ లిప్‌స్టిక్‌ని ఉపయోగిస్తున్నారా..? అయితే, కొంచెం ఆగండి! లిప్ స్టిక్ మనకు బాహ్య సౌందర్యాన్ని ఇస్తుంది.. కానీ, సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవడం తప్పనిసరి..

లిప్‌స్టిక్‌లో లేట్ న్యూరోటాక్సిన్‌లు ఉంటాయి. ఇవి పెదవులకు మంచిదికాదు. ఇందులో మాంగనీస్, లెడ్ కాడ్మియం వంటి రసాయన సమ్మేళనాలు ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి మీ పెదాలకు హాని కలిగిస్తాయి. లిప్‌స్టిక్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీ పెదవులు నల్లగా మారే ప్రమాదం కూడా ఉంది. తరచూగా లిప్ స్టిక్ వేసుకునే వారు తమ పెదవుల మీద పైన ఒక పొరలా ఏర్పడటం మీరు గమనించకపోవచ్చు. అది ముదురు రంగులో ఏర్పడుతుంది. పెదవుల లోపలి భాగం సరిగ్గా అలా కనిపించదు.

లిప్‌స్టిక్‌లలో కొన్ని హానికరమైన రసాయనాలు పాదరసం, సీసం, కాడ్మియం వంటివి మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ రసాయనాల వల్ల మనకు అనేక రకాల వ్యాధులు వస్తాయి. లిప్‌స్టిక్‌ను ఎక్కువగా అప్లై చేయడం వల్ల పెదవులకే కాదు, మూత్రపిండాలు, పొట్టకు కూడా హాని కలుగుతుంది. చాలా లిప్‌స్టిక్‌లలో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఉంటాయి. అదనంగా, లిప్‌స్టిక్‌ను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి ఉపయోగించే కొన్ని రసాయనాలు దగ్గు, కంటి చికాకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ఇతర ఆరోగ్య సమస్యల వంటి అలర్జీలను కూడా కలిగిస్తాయి. గర్భిణీలు లిప్‌స్టిక్‌కు దూరంగా ఉండాలి. లిప్‌స్టిక్‌ను తయారుచేసే పదార్థాలు కడుపులో శిశువు ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు కళ్లలో మంటను కలిగిస్తాయి. ఇది కళ్లకు చికాకు కలిగిస్తుంది. దాంతో కళ్లు ఎర్రగా మారుతాయి. లిప్‌స్టిక్‌ ఎక్కువగా వేసుకుంటే పెదాలు పొడిబారడంతోపాటు పగుళ్లు కూడా ఏర్పడతాయి. ఇది అలెర్జీలు, పెదాల రంగులో మార్పు, ముఖంపై ఇతర చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. ఎక్కువ సేపు లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల పెదవుల రంగు ముదురుతుంది. అంతేకాదు..మనం ఆహారం తిన్నప్పుడు, లిప్‌స్టిక్‌లోని కొన్ని భాగాలు మన శరీరంలోకి వెళ్తాయి. దాంతో ఇది కడుపు సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, లిప్‌స్టిక్‌ను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..