Vemulawada Rajanna Temple : మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన రాజన్న ఆలయం.. దాదాపు 5లక్షల మంది భక్తులకు..!

ఈ ఆలయానికి… తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీష్ ఘడ్ రాష్ట్రాల నుంచీ భక్తులు తరలివస్తున్నారు.. శివరాత్రి పర్వదినం రోజు.. 4 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున… సీఎం రేవంత్ రెడ్డి.. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు..టీటీడీ తరుపునా కూడా అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇప్పటికే ఆలయం విద్యుత్ దీపాలతో ఆలంకరించారు.

Vemulawada Rajanna Temple : మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన రాజన్న ఆలయం.. దాదాపు 5లక్షల మంది భక్తులకు..!
Vemulawada Rajanna Temple
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Mar 06, 2024 | 8:59 AM

రాజన్న సరిసిల్ల, 06; వేములవాడ రాజరాజేశ్వరీ స్వామి వారి ఆలయాన్ని.. దక్షిణ కాశీగా పిలుస్తారు.. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది.. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే… కోరిన కోర్కెలు తీరుతాయని భక్తల నమ్మకం.. దీంతో.. ఎన్ని కష్టాలు ఎదురైనా… స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతున్నారు.. మహాశివరాత్రి రోజు దర్శించుకోవడానికి.. భక్తులు… ఎంతో ఉత్సహాం చూపుతున్నారు. మహాశివరాత్రి వేళ రాజన్న సన్నిధిలో జాగరం చేసేందుకు భక్తులు రెండు రోజుల ముందు నుంచే వేములవాడకు బారులు తీరుతున్నారు. ఎటు చూసినా.. ఓం నమో శివాయ: అంటూ.. భక్తులు కదులుతున్నారు..

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరీ ఆలయంలో మూడు రోజుల పాటు మహా శివరాత్రి ఉత్సహాలు ఘనంగా జరుగుతాయి..ఈ నెల 8 న శివ రాత్రి వేడుకకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఆలయానికి… తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, చత్తీష్ ఘడ్ రాష్ట్రాల నుంచీ భక్తులు తరలివస్తున్నారు.. శివరాత్రి పర్వదినం రోజు.. 4 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున… సీఎం రేవంత్ రెడ్డి.. పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు..టీటీడీ తరుపునా కూడా అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇప్పటికే ఆలయం విద్యుత్ దీపాలతో ఆలంకరించారు. ప్రతి యేటా భక్తుల సంఖ్య పెరుగుతునే ఉంది.. కానీ.. ఆశించిన స్థాయి లో అభివృద్ధి జరగడం లేదని భక్తులు వాపోతున్నారు.

ఈ ఆలయ చరిత్ర వివిధ రకాలుగా ఉంది.. నరేంద్రుడు.. కొలనులో స్నానం ఆచరిస్తుండగా… శివలింగం లభించిందని.. చరిత్రకారులు చెబుతున్నారు. ఆ శివలింగానికి పూజలు నిర్వహించారని, ఆనాటిదే ఈ శివలింగం అని చెబుతారు. ఇప్పుడున్న మూల విరాట్టు అదేనని పుస్తకాల్లో రాసి ఉంది.. ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుంచీ ఉన్నదని, పురాతత్వ ఆధారాల ద్వారా తెలుస్తుంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వరస్వా ఆలయం.. మరింత ప్రసిద్ధి చెందిందని.. పురాణాలు చెబుతున్నాయి.. సిద్దులు కూడా ప్రతి రోజూ ఈ ఆలయంలో పూజలు నిర్వహించేవారని చరిత్ర ఆధారాల ద్వారా తెలుస్తుంది. దీనిని బట్టి ఈ ఆలయం అత్యంత పురాతనమైనదిగా భక్తుల విశ్వాసం. ఈ పురాతన ఆలయాన్ని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మహాశివరాత్రి సందర్భంగా.. ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి రోజూ, వంద మంది అర్చకులతో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారు. అర్థరాత్రి వేళ శివునికి…. ఏకదశ రుద్రాభిషేకం చేస్తారు. రాజన్నకు.. కోడెలను మొక్కుగా చెల్లిస్తారు.. కోరిన కోర్కెలు తీరిన తరువాత.. స్వామి వారికి కోడెలు మొక్కుగా చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలుగిస్తారు.. పూర్తిగా జాగరణ ఉంటారు.. స్వామి వారి సన్నిధిలో వందలాది మంది.. శివపార్వతులు ఉంటారు. వీరందరూ దేవుడికి అంకితమయ్యారు.. కుటుంబాలకు దూరంగా ఉంటూ.. స్వామి వారి సన్నిదిలోనే ఉంటున్నారు. శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉంటూ… స్వామి వారిని స్మరించుకుంటున్నారు.

ఇప్పటికే ఈ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేక వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు.. తాగు నీటి కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. భక్తుల రద్దీ కూడా పెరిగింది. ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని ఆలయ పూజారులు అంటున్నారు. శివరాత్రి పర్వదినం రోజు. స్వామి వారిని దర్శించుకోవడం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుపుతున్నారు. శివరాత్రి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు. భక్తులు ఎక్కడా అసౌకర్యానికి గురికాకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలుపుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…