Beauty Tips: సమ్మర్‌ ఎఫెక్ట్‌తో ముఖం రోజురోజుకీ నల్లగా మారుతుందా..?ఈ చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోండి..

సమ్మర్ లో మీ ముఖం ఎండకు కందిపోతుంది. కాళ్లు , చేతులపై ట్యాన్ ఏర్పడుతుంది. అయితే, మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు.. ఎందుకంటే.. మీ ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి అద్భుతమైన ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. దాంతో మీరు మీ చర్మ సౌందర్యాన్ని, మరింత కాంతిని తిరిగి పొందగలుగుతారు. అలాంటి ప్యాక్‌ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Beauty Tips: సమ్మర్‌ ఎఫెక్ట్‌తో ముఖం రోజురోజుకీ నల్లగా మారుతుందా..?ఈ చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోండి..
Beauty Tips
Follow us

|

Updated on: Mar 05, 2024 | 1:32 PM

నేడు చాలా మందిలో కనిపించే సమస్య ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు. ఎండవేడిమి కారణంగా చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖం, చేతులు, మెడ, కాళ్లు మొదలైన ఏ ప్రాంతమైనా సూర్యరశ్మికి గురైనా రంగు మారడంతోపాటు నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. అయితే, అలాంటి వారు ఆందోళనపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, మీ ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించి అద్భుతమైన ఫేస్‌ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. దాంతో మీరు మీ చర్మ సౌందర్యాన్ని, మరింత కాంతిని తిరిగి పొందగలుగుతారు. అలాంటి ప్యాక్‌ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఎండతో ఏర్పడ ఫేస్‌ట్యాన్‌ తొలగించేందుకు.. కేవలం రెండు పదార్ధాలతో ప్యాక్‌ని కలవండి. ఇందులో కొబ్బరినూనె, పసుపు కలిపిన ఫేస్ ప్యాక్ మీ ముఖానికి మెరుపునిస్తుంది. రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె, కొద్దిగా పసుపు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా మిక్స్‌ చేయాలి.. ఈ మిశ్రమాన్ని మీ ముఖం, మెడకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత మీ ముఖం కడగాలి.

పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన సమ్మేళనం. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ కణాలకు పోషణనిస్తాయి. పసుపు, కొబ్బరి నూనె లోతుగా హైడ్రేట్ చేస్తుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది వాపు మరియు ఎరుపును తగ్గిస్తుంది.

ఈ ప్యాక్ తో డల్ స్కిన్‌ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్కిన్ టోన్‌ను సమం చేస్తుంది. పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్‌లను తొలగిస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, పసుపులోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిసి మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఈ ఫేస్ ప్యాక్‌ ఫేస్లో పగుళ్లు రాకుండా చేస్తాయి. కొబ్బరినూనె, పసుపుతో ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles