AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బిల్‌గేట్స్‌ మెచ్చిన చాయ్ వాలా.. మనోడు టీ ఎలా పెడుతున్నాడో చూస్తే అవాక్కే..!

డాలీ చాయ్‌వాలా' సోషల్ మీడియాలో బాగా ఫేమస్. యూట్యూబ్‌లో అతనికి 'డాలీ కి తాప్రీ నాగ్‌పూర్' అనే ఛానెల్ ఉంది. డాలీ చాయ్‌వాలా తన ఛానెల్‌లో 900K సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నాడు. డాలీ చేసిన టీని బిల్ గేట్స్ తాగటంతో.. అతడు మరింత పాపులర్‌ అయ్యాడు..అయితే అతడికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ కొందరు ఆయనను అహంకారిగా అభివర్ణిస్తున్నారు.

Watch Video: బిల్‌గేట్స్‌ మెచ్చిన చాయ్ వాలా.. మనోడు టీ ఎలా పెడుతున్నాడో చూస్తే అవాక్కే..!
Dolly Chaiwala
Jyothi Gadda
|

Updated on: Mar 05, 2024 | 1:14 PM

Share

ఇటీవల మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇండియాకు వచ్చినప్పుడు డాలీ చాయ్‌వాలాగా పిలువబడే షాప్ వద్ద టీ తాగారు. దానికి సంబంధించిన వీడియోను బిల్ గేట్స్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఆ తర్వాత డాలీ చాయ్‌వాలా బాగా ఫేమస్‌ అయ్యాడు.. అనేక వార్తా ఛానెల్‌లు అతన్ని ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాయి. అయితే ఇప్పుడు డాలీ చాయ్‌వాలా మరొక వీడియో వైరల్ అవుతోంది. దీన్ని షేర్ చేయడం ద్వారా ప్రజలు అతన్ని వైఖరి పట్ల తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తు్న్నారు. తీవ్రంగా విమర్శిస్తు్న్నారు. ఇంతకీ డాలీ చాయ్‌వాలా చేశాడో తెలిస్తే మీరు అసహించుకోవటం ఖాయం..వివరాల్లోకి వెళితే..

‘డాలీ చాయ్‌వాలా’ సోషల్ మీడియాలో బాగా ఫేమస్. యూట్యూబ్‌లో అతనికి ‘డాలీ కి తాప్రీ నాగ్‌పూర్’ అనే ఛానెల్ ఉంది. డాలీ చాయ్‌వాలా తన ఛానెల్‌లో 900K సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నాడు. డాలీ చేసిన టీని బిల్ గేట్స్ తాగటంతో.. అతడు మరింత పాపులర్‌ అయ్యాడు..అయితే అతడికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ కొందరు ఆయనను అహంకారిగా అభివర్ణిస్తున్నారు. వైరల్ వీడియోలో డాలీ తన కస్టమర్‌తో మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. డాలీ మాటలను బట్టి అతను కస్టమర్‌తో అహంకారపూరితంగా, అమర్యాదగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే, అతని ఇతర వీడియోలను చూసినప్పుడు, అతని శైలి అర్థమవుతుంది.

ఇవి కూడా చదవండి

డాలీ చాయ్‌వాలా అహంకారం లిమిట్స్‌ దాటిందని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్‌ చేశారు. బిల్ గేట్స్ పేద దుకాణం వద్ద టీ తాగాడని, కొంతమంది కావాలనే ఇలాంటి ఉదేశపూర్వక వీడియోలు, వార్తలు షేర్‌ చేస్తుంటారని ఒకరు రాశారు. ఇదంతా బడా వ్యాపారుల చేసిన ఫేక్ ప్రచారంగా కొట్టిపారేస్తున్నారు.అయితే, మరికొందరు మాత్రం.. అతడి పాత వీడియోలన్నీ చూడండి.. అన్నింటిలోనూ అతడు అదే స్టైల్‌లో పనిచేస్తున్నాడని రాశారు.

అయితే, ఇక్కడ టెన్షన్‌ పడాల్సిన పనిలేదు.. సౌత్ సినిమాల నుంచి టీ అమ్మే స్టైల్‌ని నేర్చుకున్నానని డాలీ చాయ్‌వాలా చెబుతున్నాడు.. నేను ప్రజలకు కమ్మటి టీ అందించాలనుకుంటున్నాను. దాంతో పాటు వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలనుకుంటున్నాను అందుకే ఇలాంటి ట్రిక్‌ చేశానని ఎలాంటి తప్పిదం చేయలేదని డాలీ చెప్పినట్టుగా తెలిసింది. ఏది నిజం, ఏది అబద్ధమో తెలియదు గానీ, సోషల్ మీడియాలో వీడియో మాత్రం వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..