AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఈ పాము భయపెట్టదు తెగ నవ్విస్తుంది..! నాగిని కాదు అనకొండ డ్యాన్స్‌తో హల్‌చల్‌.. నెటిజన్ల రియాక్షన్‌ ఎలా ఉందంటే..!

నాగిని డ్యాన్స్‌ తరచుగా వివాహా బరాత్‌లలో కనిపిస్తుంది. నాగిని డ్యాన్స్ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. వాటిని చూసిన ప్రజలు తెగ నవ్వుకుంటుంటారు. ప్రస్తుతం, అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక అమ్మాయి నాగిని డ్యాన్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో, ప్రజలు దీనిని నాగిని డ్యాన్స్‌ కాదు.. కొండచిలువ నృత్యం అని పిలుస్తున్నారు. ఎందుకంటే..

Watch Video: ఈ పాము భయపెట్టదు తెగ నవ్విస్తుంది..! నాగిని కాదు అనకొండ డ్యాన్స్‌తో హల్‌చల్‌.. నెటిజన్ల రియాక్షన్‌ ఎలా ఉందంటే..!
Girl Nagin Dance
Jyothi Gadda
|

Updated on: Mar 05, 2024 | 12:44 PM

Share

పెళ్లిళ్లలో నాగిని డ్యాన్స్ తరచుగా కనిపిస్తుంది. నాగిని డ్యాన్స్‌కి సంబంధించిన చాలా వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, మీరు ఎప్పుడైనా కొండచిలువ డ్యాన్స్‌ చూశారా? ఓ అమ్మాయి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రజలు ఇది కొండచిలువ డ్యాన్స్ అని పిలుస్తున్నారు. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. చాలా మంది దీనిపై ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి చేసిన డ్యాన్స్ ఎలా ఉందంటే..

నాగిని డ్యాన్స్‌ తరచుగా వివాహా బరాత్‌లలో కనిపిస్తుంది. నాగిని డ్యాన్స్ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. వాటిని చూసిన ప్రజలు తెగ నవ్వుకుంటుంటారు. ప్రస్తుతం, అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఒక అమ్మాయి నాగిని డ్యాన్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో, ప్రజలు దీనిని నాగిని డ్యాన్స్‌ కాదు.. కొండచిలువ నృత్యం అని పిలుస్తున్నారు. ఎందుకంటే.. వీడియోలో కనిపించిన యువతి అధిక బరువుతో కనిపిస్తుంది. కానీ, ఆ అమ్మాయి నేలపై పడుకుని నాగిని డ్యాన్స్ చేస్తుండడం వీడియోలో కనిపిస్తుంది. ఒక వ్యక్తి రుమాలుతో వేణువు వాయిస్తూ ఆమె ఎదురుగా నిలబడి ఆడిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా అక్కడి వీడియోలు తీస్తూ హల్‌చల్‌ చేశారు. వీడియో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది. ప్రజలు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. దానిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Queen👑 (@11am_queen) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

ఇది డ్యాన్స్ కాదని, అనకొండ డ్యాన్స్ అని ఓ సోషల్ మీడియా యూజర్ రాశారు. ఆమె ఇలా డ్యాన్స్ చేస్తుందంటే ఎలాంటి మందు తాగిందో అని మరొకరు ఫన్నీగా స్పందించారు. లేదంటే, ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందని అంటున్నారు. ఫిట్‌గా ఉన్నా నేను కూడా ఇలాంటి డ్యాన్స్ చేయలేను అని ఒకరు రాశారు. మరొకరు డ్యాన్స్‌కి మనస్సు మాత్రమే అవసరమని, మనసుకు నాట్యం చేయాలని అనిపిస్తే ఎవరూ ఆపలేరు అని రాశారు.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఇది లక్ష మందికి పైగా లైక్ చేయబడింది. ఈ వీడియో ఎక్కడిది అనేది తెలియరాలేదు. వీడియోలో మహిళ చేసిన డ్యాన్స్ చూసి జనాలు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..