మల్లెపూలలో అనేక రుగ్మతలను దూరం చేసే గుణాలు ఉన్నాయి. ఈ పువ్వుల ప్లేవర్ గ్రీన్ టీ, ఇతర టీలలో రుచి పెంచడానికి ఉపయోగిస్తారు. జాస్మిన్ టీని మల్లెపూల నుండి తయారు చేయరు, కానీ ఇది మల్లె పువ్వుల సువాసనతో ఉంటుంది. తేయాకునీ, మల్లెపూలను ప్రత్యేక పద్ధతుల్లో డీహైడ్రేట్ చేసి ఈ టీని తయారు చేస్తారు. మల్లెపువ్వు టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.