AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bitter Gourd Juice: సమ్మర్‌లో కాకరకాయ జ్యూస్ తాగితే.. వంద రోగాలకు బైబై చెప్పొచ్చు!

కాకర కాయ అనగానే అందరి ముఖాలూ వాడిపోతాయి. కాకర కాయ అంటేనే అందరికీ గుర్తొచ్చేది చేదు. కానీ కాకర కాయ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. కాకర అనేది ఒక దివ్యౌషధం. సరిగ్గా వాడితే ఎన్నో రోగాలు రాకుండా చేసుకోవచ్చు. కాకరలో అనేక రకాల పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. అందులోనూ వేసవి కాలంలో తాగితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాకర జ్యూస్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి..

Bitter Gourd Juice: సమ్మర్‌లో కాకరకాయ జ్యూస్ తాగితే.. వంద రోగాలకు బైబై చెప్పొచ్చు!
Bitter Gourd 5
Chinni Enni
|

Updated on: Mar 05, 2024 | 1:07 PM

Share

కాకర కాయ అనగానే అందరి ముఖాలూ వాడిపోతాయి. కాకర కాయ అంటేనే అందరికీ గుర్తొచ్చేది చేదు. కానీ కాకర కాయ తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. కాకర అనేది ఒక దివ్యౌషధం. సరిగ్గా వాడితే ఎన్నో రోగాలు రాకుండా చేసుకోవచ్చు. కాకరలో అనేక రకాల పోషకాలు, ఖనిజాలు ఉంటాయి. అందులోనూ వేసవి కాలంలో తాగితే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాకర జ్యూస్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది. తక్షణమే ఎనర్జీ లెవల్స్ కూడా వస్తాయి. కాబట్టి సమ్మర్‌లో అప్పుడప్పుడైనా కాకర కాయ జ్యూస్ తాగితే చాలా మంచిది. మరి వేసవిలో కాకర జ్యూస్ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

జీర్ణ శక్తిని మెరుగు పరుస్తుంది:

చాలా మంది సమ్మర్‌లో జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కడుపులో ఉబ్బరం, నొప్పి, అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలతో సతమతమవుతారు. ఇలాంటి వారు వేసవిలో కాకర కాయ జ్యూస్ తాగితే చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ప్రేగులు కూడా శుభ్రపడతాయి. కడుపులోని వ్యర్థాలు, మలినాలు బయటకు పోతాయి.

ఇమ్యూనిటీ పెరుగుతుంది:

సమ్మర్‌లో నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. బయటకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఉక్కపోతతతో అల్లాడుతారు. చాలా మంది ఇన్ ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు తెలెత్తకుండా కాకరకాయ జ్యూస్ చేస్తుంది. రోజూ ఉదయం కొద్దిగా ఈ జ్యూస్ తాగితే.. శరీరంలో విపరీతంగా రోగి నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

చర్మానికి చాలా మంచిది:

సమ్మర్‌లో ఎండ దెబ్బకి చర్మం కమిలి పోతూ, నల్లగా మారుతూ, నిర్జీవంగా ఉంటుంది. కాకరలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మంచిది చేస్తుంది. ఈ జ్యూస్ తాగతే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. స్కిన్ ఇన్ ఫెక్షన్స్ నుంచి కూడా రక్షిస్తుంది.

శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది:

కాకర జ్యూస్‌లో నీటి శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఈ జ్యూస్ తాగితే శరీరాన్ని హైడ్రేట్‌గా చేస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. సమ్మర్‌లో ఈ జ్యూస్ తాగితే ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..